ఆన్‌లైన్‌లో మీ ఓట‌ర్ ఐడీ కార్డును ఇలా సుల‌భంగా డౌన్‌లోడ్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్ ప‌ద్ధ‌తి..

August 11, 2021 9:49 PM

మ‌న దేశంలోని పౌరుల వ‌ద్ద ఉండాల్సిన ముఖ్య‌మైన ప‌త్రాల్లో ఓట‌ర్ ఐడీ కార్డు ఒక‌టి. కేవ‌లం ఓటు వేసే స‌మ‌యంలోనే కాదు, ఇత‌ర స‌మ‌యాల్లోనూ ఓట‌ర్ ఐడీ కార్డు ప‌నిచేస్తుంది. ఐడీ లేదా అడ్ర‌స్ ప్రూఫ్ కింద ఓట‌ర్ ఐడీని ఉప‌యోగించుకోవ‌చ్చు. భార‌త ఎన్నిక‌ల సంఘం మ‌న‌కు ఓట‌ర్ ఐడీ కార్డుల‌ను జారీ చేస్తుంది.

how to download voter id card online step by step method

ఓట‌ర్ ఐడీ కార్డు లేక‌పోతే దిగులు చెందాల్సిన ప‌నిలేదు. ఆన్ లైన్‌లోనే సుల‌భంగా ఓట‌ర్ ఐడీ కార్డును డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. అందుకు గాను కింద తెలిపిన స్టెప్స్ ను పాటించాలి.

* ఓట‌ర్ ఐడీ కార్డును డౌన్ లోడ్ చేయాలంటే ముందుగా ఎన్నిక‌ల క‌మిష‌న్ అధికారిక వెబ్‌సైట్ https://voterportal.eci.gov.in ను సంద‌ర్శించాలి.

* త‌రువాత Voter Service Portal (NVSP) ని https://www.nvsp.in/Account/Login వెబ్‌సైట్‌లో సంద‌ర్శించాలి.

* అయితే ఇందుకు గాను అకౌంట్ ఉండాలి. అకౌంట్ లేక‌పోతే కొత్తగా ఒక అకౌంట్‌ను క్రియేట్ చేయాలి. అందుకు మెయిల్ ఐడీ, ఫోన్ నంబ‌ర్‌లను ఇవ్వాలి.

* అకౌంట్ క్రియేట్ చేశాక కొన్ని వివ‌రాల‌ను అడుగుతారు. ఆ వివ‌రాల‌ను న‌మోదు చేసి లాగిన్ అవ్వాలి.

* లాగిన్ అయ్యాక e-EPIC కార్డును డౌన్ లోడ్ చేసుకునే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.

* డౌన్ లోడ్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేయ‌గానే ఓట‌ర్ ఐడీ కార్డు పీడీఎఫ్ ఫైల్ రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది.

దాన్ని అవ‌స‌రం అనుకుంటే ప్రింట్ తీయించి లామినేష‌న్ చేసుకోవ‌చ్చు. ఓట‌ర్ ఐడీ కార్డు వ‌ల్ల సుల‌భంగా ఓటు వేసేందుకు అవ‌కాశం ఉంటుంది. భార‌త ఎన్నిక‌ల సంఘం ఓట‌ర్ల‌కు కొత్త కార్డుల‌ను అందించేందుకు గాను ఈ సౌక‌ర్యాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ విధంగా ఎవ‌రైనా స‌రే త‌మ ఓట‌ర్ ఐడీ కార్డుల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now