ఆధార్ కార్డులో ఉన్న ఫొటో న‌చ్చ‌లేదా ? అయితే ఇలా మార్చుకోండి..!

August 19, 2021 9:45 PM

ఆధార్ కార్డును తీసుకున్న త‌రువాత కూడా అందులో ఏవైనా మార్పులు ఉంటే సుల‌భంగానే చేసుకోవ‌చ్చు. కొన్ని ర‌కాల మార్పుల‌ను ఆన్‌లైన్‌లో చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. కొన్నింటికి ఆధార్ సెంట‌ర్‌కు వెళ్లాల్సి వ‌స్తుంది. అయితే ఆధార్ కార్డులో ఉన్న ఫొటో న‌చ్చ‌క‌పోతే దాన్ని ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆధార్ కార్డులో ఉన్న ఫొటో న‌చ్చ‌లేదా ? అయితే ఇలా మార్చుకోండి..!

ఆధార్ కార్డులో ఉన్న ఫొటోను మార్చుకునేందుకు అనుస‌రించాల్సిన స్టెప్స్

స్టెప్ 1 : UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ నుంచి ముందుగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

స్టెప్ 2 : ఫామ్ లో అన్ని వివ‌రాల‌ను న‌మోదు చేసిన త‌రువాత ఆధార్ కేంద్రంలో ఎన్‌రోల్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌కు ఫామ్‌ను అంద‌జేయాలి.

స్టెప్ 3 : ఫామ్‌లో మీరు ఇచ్చిన వివ‌రాల‌ను ఎగ్జిక్యూటివ్ బ‌యోమెట్రిక్ వివ‌రాల‌తో స‌రిపోల్చి చెక్ చేసుకుంటారు.

స్టెప్ 4 : ఎగ్జిక్యూటివ్ మిమ్మ‌ల్ని కొత్త‌గా ఫోటో తీస్తారు.

స్టెప్ 5 : ఇందుకు గాను రూ.25 + జీఎస్‌టీ క‌లిపి చార్జిల‌ను చెల్లించాల్సి ఉంటుంది.

స్టెప్ 6 : ఫొటో తీసిన అనంత‌రం ఎగ్జిక్యూటివ్ URN తో కూడిన అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ను అందిస్తారు.

స్టెప్ 7 : URN ను ఉప‌యోగించి ఆన్‌లైన్‌లో ఆధార్ స్టేట‌స్ తెలుసుకోవ‌చ్చు.

ఆధార్ కార్డులో ఫొటో అప్‌డేట్ అయ్యాక కొత్త ఆధార్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. లేదా ఫిజిక‌ల్ పీవీసీ కార్డును పైన తెలిపిన UIDAI వెబ్‌సైట్‌లో ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. దీంతో ఆధార్ పీవీసీ కార్డు పోస్టు ద్వారా ఇంటికి వ‌స్తుంది. ఈ విధంగా ఆధార్‌లో ఫొటోను మార్చుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment