Gold Price Today : ఈమధ్యకాలంలో బంగారం ధరలు ఎలా పెరిగాయో అందరికీ తెలిసిందే. ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. అయితే ఈ ధరలకు కాస్త బ్రేక్ పడిందనే చెప్పవచ్చు. బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తులం బంగారం ధర రూ.1 లక్షకు చేరుతుందని వార్తలు వచ్చాయి. కానీ వాటికి బ్రేక్ పడింది. తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరల్లో పెరుగుదల లేదు. కానీ ధరలు మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. ఇక మంగళవారం కూడా బంగారం ధరల్లో తగ్గుదల కనబడింది. మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,140 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,240కి చేరింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,290కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,370గా నమోదైంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,240వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 67,240కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,350కి చేరింది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,140కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,240కి చేరింది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,140కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,240కి చేరింది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రామల బంగారం ధర రూ. 67,140కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,240 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,140కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,240 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. మంగళవారం వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. మంగళవారం కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ. 86,400గా ఉంది. ఢిల్లీతోపాటు ముంబయి, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 86,400 వద్ద కొనసాగుతోంది. అలాగే చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 86,400 వద్ద కొనసాగుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…