lifestyle

Black Coffee Health Benefits : రోజూ ఉద‌యాన్నే బ్లాక్ కాఫీ తాగితే క‌లిగే 10 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Black Coffee Health Benefits : ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది బెడ్ కాఫీ లేదా టీ తాగుతుంటారు. వాస్త‌వానికి బెడ్ టీ లేదా కాఫీ తాగ‌డం అంత శ్రేయ‌స్క‌రం కాదు. ఇలా చేస్తే దీర్ఘ‌కాలంలో జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. గ్యాస్‌, అసిడిటీ, అల్సర్ బారిన ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. అయితే ఉద‌యం నిద్ర లేచాక బ్రేక్‌ఫాస్ట్ చేసిన అనంత‌రం బ్లాక్ కాఫీ తాగాలి. ఇందులో క్రీములు, చ‌క్కెర లాంటివి క‌ల‌ప‌కూడ‌దు. నేరుగానే తాగేయాలి. ఇలా రోజూ బ్లాక్ కాఫీ తాగితే మ‌నం అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రోజూ బ్లాక్ కాఫీని తాగ‌డం వ‌ల్ల క‌లిగే 10 అద్భుత‌మైన లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ బ్లాక్ కాఫీ తాగితే అధిక బ‌రువు త‌గ్గుతారు. కాఫీలో అస‌లు క్యాల‌రీలు ఉండ‌వు. క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఇది చ‌క్క‌ని డ్రింక్ అని చెప్ప‌వ‌చ్చు. దీన్ని తాగ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. కొవ్వు క‌రుగుతుంది. ఫ‌లితంగా అధిక బ‌రువు త‌గ్గుతారు. క‌నుక రోజూ బ్లాక్ కాఫీని సేవిస్తే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అలాగే దీన్ని రోజూ తాగితే మూడ్ మారుతుంది. ఇది మ‌నల్ని సంతోషంగా ఉంచే హ్యాపీ కెమిక‌ల్స్‌ను రిలీజ్ చేస్తుంది. దీంతో ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. మానసిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. డిప్రెష‌న్ త‌గ్గుతుంది. రాత్రి పూట చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది. క‌నుక రోజూ ఉద‌యం బ్లాక్ కాఫీని తాగాలి.

Black Coffee Health Benefits

డ‌యాబెటిస్ ఉన్న‌వారు రోజూ బ్లాక్ కాఫీని తాగితే మంచిది. సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల ప్ర‌కారం బ్లాక్ కాఫీని సేవించ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంద‌ట‌. క‌నుక బ్లాక్ కాఫీని రోజూ తాగాలి. ఇక డ‌యాబెటిస్ ఉన్న‌వారు దీన్ని తాగితే షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. కాఫీ యాంటీ డిప్రెసెంట్‌గా కూడా ప‌నిచేస్తుంది. ఇది సెరొటోనిన్‌, డోప‌మైన్ స్థాయిల‌ను పెంచుతుంది. దీంతో మెద‌డు యాక్టివ్‌గా మారుతుంది. ఉత్సాహంగా ప‌నిచేస్తారు. చురుగ్గా ఉంటారు.

కాఫీని తాగ‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి మెరుగుప‌డుతుంద‌ని, మ‌తిమ‌రుపు త‌గ్గుతుంద‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. అలాగే దీన్ని తాగితే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. జీర్ణాశ‌యం శుభ్రంగా మారుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు. ఇక బ్లాక్ కాఫీని తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. క‌నుక రోజూ ఉద‌యాన్నే ఒక క‌ప్పు బ్లాక్ కాఫీని సేవించండి. ఆరోగ్యంగా ఉండండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM