lifestyle

Jonna Rotte : జొన్న రొట్టెల‌ను చేయ‌డం రావ‌డం లేదా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Jonna Rotte : చ‌పాతీ, రోటీ, నాన్‌.. తిన‌డం మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు వాటి స్థానంలో జొన్న రొట్టెని లొట్ట‌లేసుకుంటూ తినేవారి సంఖ్య పెరిగింది. నిజానికి ఒక‌ప్పుడు జొన్న‌ల‌కు పేద‌ల ఆహారంగా పేరు. ఇప్పుడు మ‌న వంటిళ్ల‌లోనే కాదు, వీధుల్లోనూ జొన్న రొట్టెల త‌యారీ ఊపందుకుంది. అన్ని వ‌ర్గాల‌కు చేరువైన ఈ చిరు ధాన్యంలో పోష‌కాలు పుష్క‌లం. రుచి అమోఘం. అందుకే మ‌ధుమేహులు మొద‌లుకొని బ‌రువు త‌గ్గాల‌నుకునే వారి వ‌ర‌కు అంతా వీటినే తింటున్నారు. అయితే దీన్ని త‌యారు చేయ‌డం అంత సుల‌భ‌మేమీ కాదు. కొన్ని కిటుకులు తెలుసుకోవాలి. అవేంటో, ఇందులో ఎలాంటి పోష‌క విలువలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జొన్న‌ల్లో ఉండే పోష‌కాలు..

జొన్న‌ల్లో బి కాంప్లెక్స్ విట‌మిన్ల‌కు తోడు ఫైబ‌ర్‌, విట‌మిన్ ఎ, విట‌మిస్ సి, క్రూడ్ ఫ్యాట్‌, అమైనో యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. గ్లూటెన్ ర‌హిత ఆహారం కావ‌డంతో బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి మంచి ఎంపిక‌. ఈ జొన్న రొట్టెల్లోని కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లు శ‌రీరంలో గ్లూకోజ్‌ని నెమ్మ‌దిగా విడుద‌ల చేయ‌డం వ‌ల్ల జొన్న రొట్టెను మ‌ధుమేహులూ తిన‌వ‌చ్చు. ప్రోటీన్ అవ‌స‌రం ఎక్కువ ఉన్న శాకాహారులు దీన్ని రోజూ తీసుకోవ‌చ్చు. జొన్న పిండిలోని ఫైబ‌ర్ అరుగుద‌ల‌ను పెంచ‌డ‌మే కాదు, శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మూత్రాశ‌యంలో రాళ్లు ఏర్ప‌డ‌కుండా కాపాడుతుంది.

Jonna Rotte

జొన్న రొట్టెలు నూనె లేకుండా మంట మీద కాల్చ‌డం వ‌ల్ల ఇందులోని ఇనుము త‌గినంత‌గా శ‌రీరానికి అందుతుంది. ఇది ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గిస్తుంది. అలాగే ఇందులోని పొటాషియం, మెగ్నిషియం ర‌క్తపోటును అదుపులో ఉంచుతాయి. వీటిని క్ర‌మం త‌ప్ప‌కుండా తిన‌డం వ‌ల్ల మెనోపాజ్ ద‌శ‌లో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించ‌వ‌చ్చు.

జొన్న రొట్టెలు చేసేందుకు చిట్కాలు..

చ‌పాతీ, రోటీ చేసిన కొద్ది గంట‌ల్లోనే తినేయాలి. లేదంటే అవి పాడైపోతాయి. కానీ జొన్న రొట్టె అలా కాదు. ముఖ్యంగా క‌డ‌క్ రోటీ వారాలు, నెల‌ల త‌ర‌బ‌డి భ‌ద్ర‌ప‌రుచుకోవ‌చ్చు. మ‌రో ర‌కం మెత్త‌ని రోటీని వేడి వేడిగా ఉన్న‌ప్పుడు తిన‌డ‌మే మేలు. జొన్న పిండిని క‌ల‌ప‌డానికి వేడి నీళ్ల‌ను ఉప‌యోగించండి. నీళ్లు మ‌రిగేట‌ప్పుడే కాస్త నూనె, రుచికి స‌రిప‌డా ఉప్పు కల‌పండి. జొన్న పిండిని క‌లిపేట‌ప్పుడే ఓ చెంచా గోధుమ పిండిని చేర్చితే రొట్టెకు ప‌గుళ్లు రావు. దీన్ని త‌డిపిన వెంట‌నే చేసేయొద్దు. ఓ 10 నిమిషాలైనా త‌డి వ‌స్త్రాన్ని క‌ప్పి ప‌క్క‌న పెడితే స‌రి. అలాగే వీటిని చ‌పాతీ క‌ర్ర‌తో ఒత్త‌కూడ‌దు. చేత్తో అద్దుతూ చేస్తేనే చ‌క్క‌గా వ‌స్తాయి. రొట్టెలు మృదువుగా, విడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా జొన్న రొట్టెల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. దీన్ని తింటే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM