Gold : బంగారం అంటే ఇష్టం ఉండనిది ఎవరికి చెప్పండి. బంగారు ఆభరణాలను ధరించాలనే కోరిక మహిళలకే కాదు పురుషులకు కూడా ఉంటుంది. అయితే బంగారాన్ని ధరించి విలాసంగా ఉండాలనే కోరిక మహిళలకే కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఎవరైనా సరే పైసా పైసా కూడబెట్టి కాస్తో కూస్తో బంగారాన్ని కొంటూ పోగు చేస్తుంటారు. అది భవిష్యత్తులో పిల్లలకు పనికొస్తుందని భావిస్తుంటారు. ఇక బంగారంపై లోన్లు కూడా తీసుకోవచ్చు. అందువల్ల అది కష్టాల్లో ఆదుకుంటుందని కూడా చెప్పవచ్చు. అయితే బంగారం రేటు విషయానికి వస్తే మన కన్నా దుబాయ్‌లో బంగారం ధర తక్కువగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే 7 గ్రాముల బంగారాన్ని మన దేశంలో కొంటే ఎంతవుతుంది.. అదే దుబాయ్‌లో అయితే ఎంత అవుతుంది.. అన్న వివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం.
మన దేశంలోనే కాదు ఎక్కడైనా సరే బంగారం ధరలు రోజు రోజుకీ మారుతుంటాయి. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకి రూ.5,685 అనుకుంటే అప్పుడు 7 గ్రాముల ధర రూ.39,795 అవుతుంది. దీనిపై 3 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. అది రూ.1194 అవుతుంది. మేకింగ్ చార్జిలు కాకుండా ఆ ధర రూ.40,989 అవుతుంది. మేకింగ్ చార్జిలు 12 శాతం అనుకున్నా అవి రూ.4919 అవుతాయి. అలాగే మేకింగ్ చార్జిలపై పన్ను 5 శాతం ఉంటుంది. అది రూ.246 అవుతుంది. వ్యాట్ రీఫండ్ ఏమీ రాదు కనుక అప్పుడు మొత్తం 7 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,154 అవుతుంది.
ఇక దుబాయ్‌లో అయితే 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు మన కరెన్సీ ప్రకారం రూ.4536 (రేటు మారుతుంది) అయితే 7 గ్రాముల బంగారం ధర రూ.31,752 అవుతుంది. దీనిపై అక్కడ 5 శాతం వ్యాట్ ఉంటుంది. అది రూ.1194 అవుతుంది. మేకింగ్ చార్జిలు కాకుండా ధర రూ.33,340 అవుతుంది. 12 శాతం మేకింగ్ చార్జిలు రూ.4001 అవుతాయి. మేకింగ్ చార్జిలపై 5 శాతం పన్నుకు రూ.200 అవుతాయి. అక్కడ వ్యాట్ రీఫండ్ వస్తుంది. అది రూ.1519 ఉంటుంది. దీంతో మొత్తం నుంచి రూ.1519 తీసేయాలి. అప్పుడు 7 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర దుబాయ్‌లో రూ.36,022 అవుతుంది. అంటే అక్కడికి ఇక్కడికి బంగారం ధర సుమారుగా రూ.10వేలు తేడా వచ్చిందన్నమాట.
ఇది కేవలం 7 గ్రాముల బంగారం ధరకు అది కూడా పాత ధరను లెక్కవేస్తే వచ్చింది. ఎక్కువ మొత్తంలో బంగారం అక్కడ కొంటే ఇంకా తక్కువ ధరకే బంగారం లభిస్తుంది. కనుకనే దుబాయ్‌లో బంగారం కొనేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే అక్కడ బంగారం కొని తెచ్చినా 18 శాతం వరకు పన్ను చెల్లించాలి. అప్పుడు ధర ఇక్కడికన్నా ఎక్కువే అవుతుంది. కనుక దుబాయ్ నుంచి బంగారం కొని తెచ్చినా పెద్ద ప్రయోజనం ఉండదు. కాబట్టే స్మగ్లింగ్ ఎక్కువగా చేస్తుంటారు. అయితే చట్టాలను పూర్తిగా అర్థం చేసుకుని సరైన రీతిలో పన్ను కడితే పెద్ద మొత్తంలో బంగారాన్ని తక్కువ ధరకే ఇండియాకు తెచ్చుకోవచ్చు. అందుకు కాస్త బుర్రకు పదును పెట్టాలి. ఇలా బంగారాన్ని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…