Ayushman Bharat Card : కేంద్ర ప్రభుత్వం, చాలా స్కీములని తీసుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అందించే స్కీముల ద్వారా, చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు. రైతుల కోసం ప్రత్యేకించి, కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అలానే, పేదల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలని ప్రవేశ పెట్టడం జరిగింది. అయితే కేంద్రం తీసుకువచ్చిన వాటిల్లో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఈరోజు చూద్దాం. ఆయుష్మాన్ స్కీమ్ ద్వారా ఎన్నో ఉపయోగాలని పొందొచ్చు.
దీని కింద ఎంపిక చేసిన ఆసుపత్రిలో ఫ్రీగా చికిత్స పొందవచ్చు. ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న ప్రజలు, ఈ స్కీం ద్వారా ఉపశమనాన్ని పొందవచ్చు. పేదలకి ఆయుష్మాన్ భారత్ ఒక వరం అని చెప్పొచ్చు. ఈ పథకం ద్వారా, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళు ఐదు లక్షల వరకు చికిత్సని పొందడానికి అర్హులు. ఈ కార్డు కింద ఏ వ్యాధులకి చికిత్స పొందవచ్చు..? ఎటువంటి చికిత్సలు చేయించుకోవచ్చు అనేది కూడా చూద్దాం.
కరోనా, క్యాన్సర్, కిడ్నీ, గుండె, డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, డయాలసిస్, మోకాలి, తుంటి మార్పిడి, కంటిశుక్లం అలానే ఇతర సమస్యల కి చికిత్స చేయించుకోవచ్చు. ఈ స్కీము ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చు. కచ్చా ఇళ్లలో ఉంటున్న ప్రజలు, భూమిలేని వాళ్ళు, షెడ్యూల్డ్ కులాలు, తెగకు చెందినవారు ఈ స్కీము కి అర్హులు. అలానే, గ్రామీణ ప్రాంతాల్లో వారు, ట్రాన్స్‌జెండర్లు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు కూడా అర్హులే.
ఇక ఎలా అప్లై చేసుకోవాలో చూస్తే.. అధికారిక వెబ్‌సైట్ mera.pmjay.gov.in కి లాగిన్ అవ్వాలి. మొబైల్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసేసి… మీ నంబర్‌కు వచ్చిన OTP ఇవ్వాలి. మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. పేరు, మొబైల్ నంబర్, రేషన్ కార్డ్ వంటి వివరాలను ఇచ్చేయండి. కుడి వైపున ఉన్న కుటుంబ సభ్యులపై ట్యాబ్ చేసి, లబ్ధిదారులందరి పేర్లను కూడా యాడ్ చేయాలి. ఆ తరవాత మీకు కార్డు వస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…