Tripti Dimri : ఇప్పుడు ఎక్కడ చూసిన యానిమల్ గురించే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా రణ్‌బీర్, రష్మికతో పాటు మరో భామ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఆమె మరెవరో కాదు త్రిప్తి దిమ్రి. యానిమల్ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన ఆమె, తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాలో త్రిప్తి నటన, ఇంటిమేట్ సీన్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి. ఈ మూవీతో హిందీలోనే కాక తెలుగులోను ఈ బామకి ఫుల్ క్రేజ్ లభించింది. ప్రస్తుతం త్రిప్తికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా, ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి తన మనసులో మాట చెప్పేసింది.
తనకి సౌత్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్‌లు వచ్చినట్లు వచ్చిన వార్తలపై ఓ ఇంటర్వ్యూలో త్రిప్తి స్పందిస్తూ.. ”నేను ఇప్పటివరకు ఏ సౌత్ సినిమాను ఒప్పుకోలేదు. కానీ సౌత్‌లోనూ అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. ”నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం ఆయనతో కలిసి నటించాలని నా కోరిక అంటూ ఈ భామ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. త్రిప్తి దిమ్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ‘యానిమల్’లో రణ్‌బీర్‌కు జంటగా అందాల తార రష్మిక మందన్నా నటించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు.
యానిమల్ చిత్రంలో ‘త్రిప్తి డిమ్రీ’ ‘జోయా’ అనే పాత్రలో నటించి ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా ఐఎండీబీ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోయిన్ల లిస్ట్‌లోను త్రిప్తి మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇక ‘యానిమల్’ సినిమాతో ఇండియా వైడ్ పాపులర్ అయిన ఈ అమ్మడు కోసం ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీకి సంబంధించి పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టారనే టాక్ బాగా వినిపిస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…