వినోదం

Japan OTT Streaming : ఓటీటీలోకి వ‌చ్చేసిన కార్తీ జ‌పాన్ మూవీ తెలుగు వ‌ర్షెన్.. ఎక్క‌డ చూడొచ్చంటే..!

Japan OTT Streaming : త‌మిళ స్టార్ హీరో సూర్య సోద‌రుడు, ప్ర‌ముఖ న‌టుడు కార్తి తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా సుప‌ర‌చిత‌మే. ఆయ‌న చేసిన చాలా సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. కార్తీ కెరీర్‌లో 25వ సినిమాగా జపాన్ రూపొందించబడింది. జపాన్ కోసం కార్తీ తన మేకోవర్ మార్చుకున్నాడు. కొత్తగా కనిపించాడు. కొత్తగా వినిపించాడు. తన గొంతులోని మాడ్యులేషన్ సైతం కొత్తగా వినిపించి అలరించింది. నవంబర్ 10న ఈ చిత్రం థియేటర్లోకి వచ్చి ప్రేక్ష‌కుల‌ని మెప్పించింది. అయితే జ‌పాన్ మూవీ తమిళ్ వర్షన్ కొద్ది రోజుల క్రితం ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు తెలుగు వర్షన్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.నేటి( డిసెంబర్ 13) నుంచి జపాన్ తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ జపాన్ సినిమా ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకోగా, జపాన్ సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించినన్ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. జపాన్ సినిమాలో కార్తీ డిఫరెంట్ లుక్ లో కనిపించి మెప్పించారు. అలాగే ఆయన స్లాంగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. స‌రికొత్త కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ని మెప్పించే కార్తీ సినిమా కోసం అంద‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. జ‌పాన్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రం నిరాశ‌ప‌ర‌చింది. సినిమా మొదట్లో బాగున్నా తర్వాత బోర్ కొట్టిస్తుంది. రెగ్యూలర్ సీన్లు ఉంటాయి. సినిమాలో చూపించిన ట్విస్టులు పెద్దగా వర్కౌట్ కాలేదు.

Japan OTT Streaming

జ‌పాన్ చిత్రంని కార్తీన్ని ఒక్కడే తన భుజాన మోసినట్టుగా అనిపిస్తుంది. సునీల్ పాత్ర కొన్ని సార్లు సీరియస్‌గా అనిపిస్తుంది. ఇంకొన్ని సార్లు కామెడీగా కనిపిస్తుంది. అను ఇమాన్యుయేల్ పాత్రకు ఇంపార్టెన్స్ లేదనిపిస్తుంది. కనిపించేది కూడా కొద్ది సేపే. కేఎస్ రవికుమార్, రాజేష్ అగర్వాల్ ఇలా మిగిలిన పాత్రలన్నీ ఓకే అనిపిస్తాయి.సాంకేతికంగా చూస్తే.. మాటలు కొన్ని చోట్ల నవ్విస్తాయి. ఇంకొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి. పాటలు ఏమంత ప్రభావాన్ని చూపించవు. విజువల్స్ బాగుంటాయి. ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోవడం వల్లే నిడివి కూడా సమస్యగానే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM