టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కేవైసీ మోసాలు దేశంలో పెరుగుతున్న దృష్ట్యా తమ కస్టమర్లు అలర్ట్‌గా ఉండాలని సూచించింది. తమ కస్టమర్లకు కేవైసీ వివరాలను అప్‌డేట్ చేస్తామంటూ ఎస్ఎంఎస్‌లు, కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని, అందువల్ల ఈ విషయంలో కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
కేవైసీ వివరాలను అప్‌డేట్ చేస్తామంటూ కస్టమర్లకు కొందరు ఎస్ఎంఎస్‌లు పంపుతున్నారని, కాల్స్ చేస్తున్నారని ఆ కంపెనీ తెలిపింది. అయితే వాటిని నమ్మకూడదని, తాము ఎప్పుడూ అలా అడగమని తెలిపింది. ఎవరైనా కేవైసీ అప్‌డేట్ చేస్తామని వివరాలను అడిగితే చెప్పకూడదని, ముఖ్యంగా ఓటీపీలను అస్సలు చెప్పకూడదని సూచించింది. లేదంటే సిమ్ ఫ్రాడ్ జరుగుతుందని, దీంతో డబ్బులు నష్టపోయేందుకు అవకాశం ఉంటుందని వొడాఫోన్ ఐడియా హెచ్చరికలు జారీ చేసింది.
ఇటీవలి కాలంలో ఎస్‌బీఐ వంటి బ్యాంకులతోపాటు పేటీఎం కస్టమర్లకు కూడా ఇలాగే కాల్స్, ఎస్ఎంఎస్‌లు వస్తున్నాయి. అయితే కేవైసీ అప్‌డేట్ చేస్తామని ఎవరైనా చెబితే అస్సలు నమ్మకూడదు. కంపెనీలు నిజానికి కాల్ చేసి సమాచారం అడగవు. కనుక ఇలా చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…