జీమెయిల్ వినియోగదారుల్లో చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య స్టోరేజ్ ఫుల్. స్టోరేజ్ పూర్తైంది, కొత్త మెయిల్స్ రావాలంటే మెయిల్స్ డిలీట్ చేయండి లేదా స్టోరేజ్ కొనండి.. అనే నోటిఫికేషన్లు రావడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గూగుల్ ప్రతి జీమెయిల్ అకౌంట్‌కు 15 జీబీ ఉచిత స్టోరేజ్ ఇస్తుంది. ఇందులో Gmail, Google Drive, Google Photos అన్నీ కలిసే ఉంటాయి. అయితే ప్రమోషనల్ మెయిల్స్, న్యూస్‌లెటర్స్, భారీ అటాచ్‌మెంట్లు ఉన్న మెయిల్స్ కారణంగా ఈ స్టోరేజ్ వేగంగా నిండిపోతుంది. కానీ ముఖ్యమైన మెయిల్స్ తొలగించకుండా, కేవలం కొన్ని నిమిషాల్లో జీమెయిల్‌లో స్పేస్ ఖాళీ చేయాలంటే ఈ చిట్కాలు మీకు ఉపయోగపడతాయి.
మీ జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయిందంటే ముందుగా Google Storage పేజీకి వెళ్లి ఏది ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుందో చెక్ చేయాలి. అక్కడ Gmail, Drive, Photos విడివిడిగా ఎంత స్పేస్ తీసుకుంటున్నాయో చూపిస్తుంది. డ్రైవ్ లేదా ఫోటోలు ఎక్కువ స్పేస్ తీసుకుంటే అవసరం లేని ఫైల్స్, డూప్లికేట్ ఫోటోలను తొలగించండి. ఇక జీమెయిల్ సెర్చ్ బార్‌లో larger:10M అని టైప్ చేస్తే 10 ఎంబీకి మించిన మెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. వీటిలో అవసరం లేని మెయిల్స్, పాత అటాచ్‌మెంట్లు ఉన్న మెయిల్స్‌ను డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత Trash ఫోల్డర్‌ను ఖాళీ చేయడం మర్చిపోవద్దు. లేకపోతే స్పేస్ రిలీజ్ అవదు.
వెబ్‌సైట్లు, ఆఫర్లు, షాపింగ్ యాప్స్ కారణంగా రోజూ వందలాది ప్రమోషనల్ మెయిల్స్ వస్తుంటాయి. ఇవి చదవకపోయినా స్టోరేజ్ మాత్రం తీసుకుంటాయి. కాబట్టి అవసరం లేని న్యూస్‌లెటర్స్ నుంచి Unsubscribe అవ్వండి. అలాగే పాత ప్రమోషనల్ మెయిల్స్‌ను ఒకేసారి సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. ఇక చాలామంది మర్చిపోతారు కానీ Sent Mail, Spam కూడా పెద్ద మొత్తంలో స్పేస్ తీసుకుంటాయి. సెర్చ్ బార్‌లో in:sent has:attachment అని టైప్ చేస్తే మీరు పంపిన భారీ అటాచ్‌మెంట్లు ఉన్న మెయిల్స్ కనిపిస్తాయి. అక్కడ అవసరం లేని వాటిని తొలగించండి. స్పామ్ ఫోల్డర్‌ను కూడా ఖాళీ చేయండి.
ఇలా చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే మీ జీమెయిల్ ఖాతాలో కొన్ని నిమిషాల్లోనే అధిక మొత్తంలో స్టోరేజ్ ఖాళీ చేయవచ్చు. తరచుగా ఈ ప్రక్రియను పాటిస్తే, స్టోరేజ్ కొనాల్సిన అవసరం ఉండదు. జీమెయిల్‌ను సాఫీగా ఉపయోగించుకోవచ్చు.
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళనాడు వాసి అయినప్పటికీ పలు ఇతర భాషల్లోనూ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. గతంలో ఆమె…
మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌కు టాలీవుడ్‌లో తొలి మూవీలోనే చేదు అనుభవం ఎదురైంది.ఆమె నటించిన రాజాసాబ్ మూవీ అట్టర్ ఫ్లాప్‌గా…
దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో రాముడిగా రణబీర్ కపూర్ తొలి…
హనుమాన్ జయంతి సందర్భంగా తమ ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న స్వామి వారి విగ్రహంపై సూర్య కిరణాలు పడడం తన…
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.…
అమరావతి రాజధానిగా ఉండడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాజధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని, దానికి తాము…
పబ్లిక్‌లో ఉన్నప్పుడు సెలబ్రిటీలతో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గందరగోళ…
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన…