నటుడు చిరంజీవి తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులకు స్పష్టతనిచ్చారు. ఇటీవల తాను స్వల్ప స్థాయి భుజం (షోల్డర్) కీహోల్ సర్జరీ చేయించుకున్నానని, ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నానని తెలిపారు. చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో భుజానికి స్లింగ్ ధరించిన ఫోటోను షేర్ చేస్తూ పోస్టు పెట్టారు. చాలామంది శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి అడుగుతున్నారు. ఇది కేవలం చిన్నపాటి షోల్డర్ కీహోల్ సర్జరీ మాత్రమే. ఇప్పుడు బాగా కోలుకుంటున్నాను. మళ్లీ నిత్య కార్యక్రమాలకు తిరిగి వస్తున్నాను.. అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ నితిన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, తనపై చూపిన ప్రేమాభిమానాలకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
కాగా ఇటీవల చిరంజీవి తన మనవడు, మనవరాలి పేర్లను కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రామ్‌చరణ్, ఉపాసన దంపతుల పిల్లల నామకరణ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ పేర్ల వెనుక ఉన్న అర్థాన్ని వివరించారు. మనవడి పేరు శివ రామ్ అని, అది శివశంకర వరప్రసాద్ నుంచి ప్రేరణ పొందిన శివతో పాటు, రామ్‌చరణ్‌ను ప్రతిబింబించే రామ్ కలయికగా ఆధ్యాత్మిక శక్తి, ధర్మబద్ధతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.
అలాగే మనవరాలు అన్వీర దేవి పేరు ధైర్యం, శక్తి, దైవిక రక్షణకు ప్రతిరూపమని, కనకదుర్గాదేవి ఆశీస్సుల ప్రేరణతో ఈ పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. కాగా నూతన శిశువులపై అందరూ తమ ఆశీస్సులు కురిపించాలని చిరంజీవి కోరారు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆయన నటించిన మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేయగా, ఆయన తరువాతి చిత్రం విశ్వంభరతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక సమాచారం ప్రకటించనున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళనాడు వాసి అయినప్పటికీ పలు ఇతర భాషల్లోనూ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. గతంలో ఆమె…
మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌కు టాలీవుడ్‌లో తొలి మూవీలోనే చేదు అనుభవం ఎదురైంది.ఆమె నటించిన రాజాసాబ్ మూవీ అట్టర్ ఫ్లాప్‌గా…
దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో రాముడిగా రణబీర్ కపూర్ తొలి…
హనుమాన్ జయంతి సందర్భంగా తమ ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న స్వామి వారి విగ్రహంపై సూర్య కిరణాలు పడడం తన…
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.…
అమరావతి రాజధానిగా ఉండడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాజధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని, దానికి తాము…
పబ్లిక్‌లో ఉన్నప్పుడు సెలబ్రిటీలతో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గందరగోళ…