6.58 ఇంచుల డిస్‌ప్లే, 8జీబీ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో లాంచ్ అయిన వివో వై72 5జి స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

July 16, 2021 3:07 PM

మొబైల్స్ త‌యారీదారు వివో భార‌త్‌లో వై72 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఇది వివోకు చెందిన లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ కావ‌డం విశేషం. వై సిరీస్‌లో వ‌చ్చిన తొలి 5జి ఫోన్ కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఇందులో 6.58 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది.

vivo Y72 5G smart phone launched in india

ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 480 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఇది 5జి కి స‌పోర్ట్‌ను అందిస్తుంది. 8జీబీ ర్యామ్‌ను ఏర్పాటు చేశారు. వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్ ను అమర్చారు. ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ల‌భిస్తుంది.

వివో వై72 5జి ఫీచ‌ర్లు

  • 6.58 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2408 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 480 ప్రాసెస‌ర్‌, 8జీబీ ర్యామ్
  • 128/256 జీబీ స్టోరేజ్, 1టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 11
  • 48, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1
  • యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

వివో వై72 5జి స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.20,990 ఉండ‌గా దీన్ని ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లోనూ విక్ర‌యిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment