వాచ్‌ల త‌యారీ కంపెనీ టైమెక్స్ లాంచ్ చేసిన కొత్త స్మార్ట్ వాచ్‌.. భ‌లే ఉంది.. అనేక సెన్సార్లు ఉన్నాయి.. ధ‌ర చాలా త‌క్కువ‌..!

July 14, 2021 8:21 PM

ప్ర‌ముఖ వాచ్‌ల త‌యారీదారు టైమెక్స్ భార‌త మార్కెట్‌లో మ‌రో కొత్త స్మార్ట్ వాచ్‌ను విడుద‌ల చేసింది. టైమెక్స్ హీలిక్స్ 2.0 పేరిట ఆ వాచ్‌ను విడుద‌ల చేశారు. ఇందులో అనేక ర‌కాల సెన్సార్లు ఉంటాయి. టెంప‌రేచ‌ర్ సెన్సార్ కూడా ఉంటుంది. స్మార్ట్ వాచ్‌లు మార్కెట్‌లో వ‌చ్చి కొన్ని సంవ‌త్స‌రాలే అయింది. కానీ టైమెక్స్ కంపెనీ రిస్ట్ వాచ్‌ల త‌యారీలో ఎప్ప‌టి నుంచో పేరు గాంచింది. ఈ క్ర‌మంలోనే మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా టైమెక్స్ కూడా కొన్ని నెల‌ల కింద‌టే స్మార్ట్ వాచ్ రంగంలోకి ప్ర‌వేశించింది. అందులో భాగంగానే ఆ కంపెనీ స్మార్ట్ వాచ్‌ల‌ను త‌యారు చేసి అందిస్తోంది.

Timex Helix Smart 2.0 smart watch launched in india

హీలిక్స్ 2.0 స్మార్ట్ వాచ్‌లో హార్ట్ రేట్ సెన్సార్, టెంప‌రేచ‌ర్ సెన్సార్‌, బ్ల‌డ్ ఆక్సిజ‌న్ సెన్సార్ వంటి అనేక ర‌కాల సెన్సార్లు ఉన్నాయి. ఈ వాచ్ డ‌య‌ల్ చ‌తుర‌స్రాకారంలో ఉంటుంది. బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను ఎక్కువ‌గా ఇస్తుంది. ఒక్క సారి చార్జింగ్ చేస్తే 9 రోజుల వ‌రకు బ్యాట‌రీ బ్యాక‌ప్ వ‌స్తుంది. ఈ వాచ్‌ను కొనుగోలు చేసిన వారికి టైమెక్స్ డాక్ ఆన్‌లైన్‌కు చెందిన స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను నెల రోజుల పాటు ఉచితంగా అందిస్తోంది.

ఇక ఈ వాచ్‌లో అనేక ఫీచ‌ర్లు యూజ‌ర్ల‌కు ల‌భిస్తున్నాయి. టైమెక్స్ హీలిక్స్ స్మార్ట్ 2.0 వాచ్‌లో 1.55 ఇంచుల ట‌చ్ స్క్రీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ప‌లు ర‌కాల సెన్సార్లు ఇందులో ఉన్నాయి. బ్యాట‌రీ బ్యాక‌ప్ 9 రోజుల వ‌ర‌కు వ‌స్తుంది. 3 గంట‌ల్లో వాచ్‌ను చార్జింగ్ చేసుకోవ‌చ్చు. 10 ర‌కాల స్పోర్ట్స్ మోడ్స్‌ను అందిస్తున్నారు. 20 ర‌కాలకు పైగా వాచ్ ఫేస్‌లు ఇందులో ల‌భిస్తున్నారు. ఈ వాచ్‌కు ఐపీ 68 వాట‌ర్, డస్ట్ రెసిస్టిన్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ వాచ్ ధ‌ర రూ.3,999గా ఉంది. జూలై 26వ తేదీ నుంచి అమెజాన్‌లో ఈ వాచ్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment