6000ఎంఏహెచ్ బ్యాటరీతో టెక్నో కొత్త స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర త‌క్కువే..!

June 12, 2021 2:19 PM

మొబైల్స్ త‌యారీదారు టెక్నో భార‌త్‌లో కొత్త‌గా టెక్నో స్పార్క్ 7టి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెస‌ర్‌ను అమర్చారు. 4జీబీ వ‌ర‌కు ర్యామ్ ల‌భిస్తుంది. ఈ ఫోన్‌లో వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో ఏఐ ఆధారిత కెమెరాను అమ‌ర్చారు. ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 గో ఎడిష‌న్‌ను అందిస్తున్నారు. దీంట్లో డెడికేటెడ్ డ్యుయల్ సిమ్‌, మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ల‌ను అందిస్తున్నారు. అలాగే 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ల‌భిస్తుంది.

TECNO Spark 7T smart phone launched in india

టెక్నో స్పార్క్ 7టి ఫీచ‌ర్లు

  • 6.5 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్
  • 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 11
  • 48 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
  • 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

టెక్నో స్పార్క్ 7టి స్మార్ట్ ఫోన్ నెబులా ఆరెంజ్‌, మాగ్నెట్ బ్లాక్, జ్యువెల్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్ ధ‌ర రూ.8,999గా ఉంది. కానీ లాంచింగ్ సంద‌ర్భంగా రూ.7,999కే విక్ర‌యించ‌నున్నారు. జూన్ 15 నుంచి అమెజాన్ సైట్ లో ఈ ఫోన్ ల‌భిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment