కేవ‌లం రూ.6,999కే టెక్నో కొత్త స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

April 12, 2021 2:22 PM

ట్రాన్స్‌ష‌న్ ఇండియా లిమిటెడ్ కంపెనీ టెక్నో సిరీస్‌లో కొత్త స్మార్ట్ ఫోన్‌ను టెక్నో స్పార్క్ 7 పేరిట విడుద‌ల చేసింది. ఇందులో 6.52 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ హీలియో ఎ25 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 3 జీబీ వ‌ర‌కు ర్యామ్ ల‌భిస్తుంది. 16 మెగాపిక్స‌ల్ కెమెరా వెనుక భాగంలో ఉంది. ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 11 గో ఎడిష‌న్ ఇందులో ల‌భిస్తుంది.

TECNO Spark 7 smart phone launched india

ఈ ఫోన్‌లో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ వెనుక భాగంలో ఉంది. డెడికేటెడ్ డ్యుయ‌ల్ సిమ్‌, మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ల‌ను ఏర్పాటు చేశారు. 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ల‌భిస్తుంది.

టెక్నో స్పార్క్ 7 ఫీచ‌ర్లు

  • 6.52 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ఎ25 ప్రాసెస‌ర్‌, 2/3 జీబీ ర్యామ్
  • 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 11 గో ఎడిష‌న్‌, 16, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు
  • ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
  • 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

టెక్నో స్పార్క్ 7 స్మార్ట్ ఫోన్ మాగ్నెట్ బ్లాక్‌, మార్ఫియ‌స్ బ్లూ, స్ప్రూస్ గ్రీన్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్ కు చెందిన 2జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.6,999 ఉండ‌గా, 3జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.7,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఏప్రిల్ 16 నుంచి అమెజాన్ లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్ర‌యించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment