ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ (ఫ్యాన్ ఎడిషన్) స్మార్ట్‌ఫోన్‌కు గాను 5జి వేరియెంట్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన సూపర్ అమోలెడ్ ఇన్పినిటీ-ఓ ఫ్లాట్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ ఉంది. 5జికి సపోర్ట్ లభిస్తుంది. 8జీబీ ర్యామ్ పొందుతారు. ఇన్‌డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లభిస్తుంది.
ఈ ఫోన్ వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ లెన్స్, 8 మెగాపిక్సల్ టెలిఫోటో లెన్స్‌ను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌కు ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. వైర్‌లెస్ చార్జింగ్‌కు సపోర్ట్ లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్20ఎఫ్ఈ 5జి స్మార్ట్ ఫోన్ క్లౌడ్ లావెండర్, క్లౌడ్ మింట్, క్లౌడ్ నేవీ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్ అసలు ధర రూ.55,999. కానీ లాంచింగ్ ఆఫర్ కింద రూ.47,999 ధరకే దీన్ని అందిస్తున్నారు. శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్, శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, లీడింగ్ రిటెయిల్ ఔట్‌లెట్‌లలో ఈ ఫోన్ లభిస్తోంది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…