ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ ఎడిషన్ ప్రారంభమవుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే ఢిల్లీ జట్టుకు రిషబ్ పంత్ నాయకత్వం వహించనున్నాడు. అంతకు ముందు శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అయ్యర్ కు గాయం అయింది. దీంతో జట్టు యాజమాన్యం పంత్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఈ మేరకు ఢిల్లీ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా పంత్ తొలిసారిగా ఐపీఎల్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టబోతున్నాడు. గతంలో పంత్ ఢిల్లీ రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఐపీఎల్‌లో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించబోతుండడం ఇదే తొలిసారి. దీంతో పంత్ కెప్టెన్‌గా ఎలా రాణిస్తాడు ? అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
ఇక తనకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడంపై పంత్ స్పందిస్తూ.. తనది ఢిల్లీ అని, అక్కడే పుట్టి పెరిగానని, ఇప్పుడు ఆ జట్టుకు నాయకత్వం వహిస్తుండడం ఆనందంగా ఉందని అన్నాడు. తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు అతను జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని, ఈ ఎడిషన్‌లో ఢిల్లీకి ఐపీఎల్ టైటిల్‌ను అందించేందుకు కృషి చేస్తానని తెలిపాడు.
కాగా ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ గత రెండు సీజన్లకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ సీజన్లలో అతను కెప్టెన్ గా రాణించాడు. పంత్‌కు ఇదొక చక్కని అవకాశం. ఇంగ్లండ్ తో సిరీస్‌లో బ్యాట్‌తో రాణించాడు. ఇప్పుడు కెప్టెన్‌గా రాణించాలని కోరుకుంటున్నానని తెలిపాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…