---Advertisement---

ఈ ఫోన్ ధ‌ర భారీగా త‌గ్గింది.. ఏకంగా రూ.22వేలు త‌గ్గించారు..!

July 27, 2021 10:11 PM
---Advertisement---

ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ కొనాల‌ని చూస్తున్నారా ? అయితే ఈ స‌ద‌వ‌కాశం మీ కోస‌మే. శాంసంగ్ త‌న గెలాక్సీ నోట్ 20 స్మార్ట్ ఫోన్‌కు గాను భారీగా ధ‌ర త‌గ్గించింది. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.22వేల డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్‌ను ప్ర‌స్తుతం వినియోగ‌దారులు రూ.54,999 ధ‌రకు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

samsung galaxy note 20 got a price cut of rs 22000

గెలాక్సీ నోట్ 20 అస‌లు ధ‌ర రూ.76,999 కాగా రూ.22వేలు త‌గ్గ‌డంతో ఇప్పుడీ ఫోన్‌ను రూ.54,999 ధ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ఈ-కామ‌ర్స్ సైట్ల‌లో, అన్ని ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్ స్టోర్‌ల‌లోనూ త‌గ్గిన ధ‌ర‌కే ఈ ఫోన్ ప్ర‌స్తుతం ల‌భిస్తోంది. ఇందులో మిస్టిక్ బ్రాంజ్‌, మిస్టిక్ గ్రీన్ క‌ల‌ర్ వేరియెంట్లు ఉన్నాయి.

అమెజాన్ లో మాత్రం మిస్టిక్ బ్లూ వేరియెంట్‌ను రూ.60,999 ధ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. ఇక ఇదే మోడ‌ల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.66వేలకు విక్ర‌యిస్తున్నారు. కానీ మిగిలిన క‌ల‌ర్ మోడ‌ల్స్‌ను మాత్రం పైన చెప్పిన ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 ఫోన్‌లో.. 6.7 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, ఎగ్జినోస్ 990 ప్రాసెస‌ర్‌, 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్, 12, 12, 64 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 10 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్ లెస్ చార్జింగ్ వంటి ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now