6.6 ఇంచుల డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో వ‌చ్చిన గెలాక్సీ ఎ22 5జి స్మార్ట్ ఫోన్‌..!

July 23, 2021 10:53 PM

శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎ22 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్ లో విడుద‌ల చేసింది. ఇందులో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది.

Samsung Galaxy A22 5G smart phone launched

ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. అందువ‌ల్ల 5జికి స‌పోర్ట్ ల‌భిస్తుంది. 6/8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందిస్తున్నారు. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. రెండు సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు.

ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను ఇందులో అందిస్తున్నారు. 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాను వెనుక వైపు ఏర్పాటు చేశారు. దీనికి తోడు 5, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండు అద‌నంగా ఉన్నాయి. 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాను అమ‌ర్చారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ల‌భిస్తుంది. డాల్బీ అట్మోస్ ఫీచ‌ర్‌ను ఏర్పాటు చేశారు. 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఇత‌ర ఫీచ‌ర్ల‌ను ఇందులో ఏర్పాటు చేశారు.

శాంసంగ్ గెలాక్సీ ఎ22 5జి స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధ‌ర రూ.19,999 ఉండ‌గా, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.21,999గా ఉంది. ఈ ఫోన్‌ను అన్ని ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్ స్టోర్స్‌లో విక్ర‌యిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో ఈ ఫోన్‌పై రూ.1500 వ‌ర‌కు క్యాష్ బ్యాక్ పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment