అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన రెడ్‌మీ నోట్‌10టి 5జి స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర త‌క్కువే..!

July 21, 2021 5:22 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ భార‌త్ లో రెడ్‌మీ నోట్‌10టి 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులోకి వ‌చ్చిన లేటెస్ట్ 5జి రెడ్‌మీ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. దీని వ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది.

Redmi Note 10T 5G smart phone launched in India

రెడ్‌మీ నోట్‌10టి 5జి ఫీచ‌ర్లు

  • 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1080 × 2400 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెస‌ర్
  • 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్, 1 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11
  • హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్, 48, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్, డ్యుయ‌ల్ 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1
  • యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

రెడ్‌మీ నోట్‌10టి 5జి స్మార్ట్ ఫోన్ కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.13,999 ఉండ‌గా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోర‌జ్ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.15,999గా నిర్ణ‌యించారు. ఈ ఫోన్‌ను ఈ నెల 26వ తేదీ నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment