ఒప్పో నుంచి రెండు కొత్త 5జి ఫోన్లు.. ఫీచ‌ర్లు అదిరిపోయాయ్‌..!

July 14, 2021 6:18 PM

దేశంలో 5జి స్మార్ట్ ఫోన్ల హ‌వా న‌డుస్తోంది. అందులో భాగంగానే కంపెనీలు 5జి ఫోన్ల‌ను త‌యారు చేసి వినియోగ‌దారుల‌కు అందిస్తున్నాయి. ఇక తాజాగా ఒప్పో కూడా మ‌రో రెండు 5జి ఫోన్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఒప్పో రెనో 6, రెనో 6 ప్రొ పేరిట రెండు 5జి ఫోన్లు విడుద‌ల‌య్యాయి. వీటిల్లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

oppo launched reno 6 5g smart phones in india

ఒప్పో రెనో6 5జి ఫీచ‌ర్లు

  • 6.5 ఇంచుల డిస్‌ప్లే, ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్
  • గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెస‌ర్
  • 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11, డ్యుయ‌ల్ సిమ్
  • 64, 8, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  • ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
  • బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
  • 4300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 65 వాట్ల ఫాస్ట్ చార్జింగ్

ఒప్పో రెనో 6 ప్రొ 5జి ఫీచ‌ర్లు

  • 6.55 ఇంచుల డిస్‌ప్లే, ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్
  • ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెస‌ర్‌, 12జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 11, డ్యుయ‌ల్ సిమ్‌, 64, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
  • 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
  • 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్ సి
  • 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 65 వాట్ల ఫాస్ట్ చార్జింగ్

కాగా ఒప్పో రెనో6 5జి ఫోన్ ధ‌ర రూ.29,990 గా ఉంది. అలాగే ఒప్పో రెనో 6 ప్రొ 5జి ఫోన్ ధ‌రను రూ.39,990గా నిర్ణ‌యించారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈనెల‌ 23వ తేదీ నుంచి ఈ ఫోన్లు ల‌భిస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment