48 మెగాపిక్స‌ల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో ఒప్పో ఎఫ్‌19 స్మార్ట్ ఫోన్‌..!

April 7, 2021 1:11 PM

మొబైల్స్ త‌యారీదారు ఒప్పో.. ఎఫ్‌19 పేరిట భార‌త్‌లో ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఇందులో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఇందులో ల‌భిస్తుంది. వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌, 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది. దీనికి ఫ్లాష్ చార్జింగ్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఫోన్ కేవ‌లం 72 నిమిషాల్లోనే పూర్తిగా చార్జింగ్ అవుతుంది.

OPPO F19 smart phone launched in india

ఒప్పో ఎఫ్‌19 ఫీచ‌ర్లు

  • 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2400 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 662 ప్రాసెస‌ర్‌, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్
  • ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌, 48, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  • ఇన్‌డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
  • యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫ్లాష్ చార్జింగ్

ఒప్పో ఎఫ్‌19 స్మార్ట్ ఫోన్ ప్రిజ‌మ్ బ్లాక్‌, మిడ్‌నైట్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్ ధ‌ర రూ.18,990గా ఉంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌తోపాటు ఇత‌ర ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఏప్రిల్ 9వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోట‌క్, స్టాండ‌ర్డ్ చార్ట‌ర్డ్ కార్డుల‌పై ఫ్లాట్ 7.5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తారు. ఎంపిక చేసిన కార్డుల‌తో జీరో డౌన్ పేమెంట్‌తో ఈ ఫోన్‌ను కొన‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment