గ్యాడ్జెట్స్

అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన ఒప్పో ఎ74 5జి స్మార్ట్ ఫోన్

మొబైల్స్ త‌యారీదారు ఒప్పో కొత్త‌గా ఎ74 5జి పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఒప్పోకు చెందిన లేటెస్ట్ 5జి ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 480 ప్రాసెస‌ర్‌, 6జీబీ ర్యామ్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ల‌భిస్తుంది.

ఈ ఫోన్‌లో 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్స‌ల్ మోనో కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు ప‌క్క భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ల‌భిస్తుంది.

ఒప్పో ఎ74 5జి ఫీచ‌ర్లు

  • 6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2400×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 480 ప్రాసెస‌ర్, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్
  • 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 11 ఓఎస్
  • 48, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
  • సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
  • బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

ఒప్పో ఎ74 5జి స్మార్ట్‌ఫోన్ ఫ్లుయిడ్ బ్లాక్‌, ఫంటాస్టిక్ ప‌ర్పుల్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్ ధ‌ర రూ.17,990 ఉండ‌గా అమెజాన్ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు అన్ని ఆఫ్‌లైన్ స్టోర్‌ల‌లో దీన్ని ఏప్రిల్ 26వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు.

లాంచింగ్ సంద‌ర్బంగా ఈ ఫోన్‌పై ఎంపిక చేసిన బ్యాంకుల‌కు చెందిన కార్డుల‌తో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. 9 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం ల‌భిస్తుంది. 2 ఏళ్ల వ‌ర‌కు ఎక్స్‌టెండెడ్ వారంటీ అందిస్తారు.

ఆఫ్‌లైన్ స్టోర్‌ల‌లో అయితే హెచ్‌డీఎఫ్సీ, స్టాండ‌ర్డ్ చార్ట‌ర్డ్‌, కోట‌క్ మ‌హీంద్రా, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, ఫెడ‌ర‌ల్ బ్యాంక్ కార్డుల‌తో 5 శాతం క్యాష్ బ్యాక్ పొంద‌వ‌చ్చు. పేటీఎం ద్వారా అయితే 11 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ అందిస్తారు. జీరో డౌన్ పేమెంట్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే 6 నెల‌ల నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందివ్వ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM