ఐపీఎల్

ఐపీఎల్ 2021: చెన్నై ఖాతాలో మ‌రో విజ‌యం.. కోల్‌క‌తాపై గెలుపు..

ముంబైలో జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 టోర్నీ 15వ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యం సాధించింది. చెన్నై నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఓ ద‌శ‌లో ఛేదించేట‌ట్లే క‌న‌బ‌డింది. కానీ ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను కోల్పోతూ వ‌చ్చింది. దీంతో కోల్‌క‌తాపై చెన్నై 18 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా చెన్నై బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 220 ప‌రుగులు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్ల‌లో డుప్లెసిస్‌, రుతురాజ్ గైక్వాడ్‌లు అద్భుతంగా రాణించారు. 60 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో డుప్లెసిస్ 95 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌గా 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో రుతురాజ్ గైక్వాడ్ 64 ప‌రుగులు చేశాడు. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, సునీల్ న‌రైన్‌, ఆండ్రు ర‌స్సెల్‌ల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన కోల్‌క‌తా 19.1 ఓవ‌ర్ల‌లో ఆలౌట్ అయింది. 202 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. కోల్‌క‌తా బ్యాట్స్‌మెన్ల‌లో ప్యాట్ క‌మ్మిన్స్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 66 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆండ్రు ర‌స్సెల్ 22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 54 ప‌రుగులు చేయ‌గా, దినేష్ కార్తీక్ 24 బంత‌ల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 40 ప‌రుగులు చేశాడు. చెన్నై బౌల‌ర్ల‌లో దీపక్ చాహ‌ర్ 4 వికెట్లు, లుంగి ఎంగిడిలు 3 వికెట్లు ప‌డ‌గొట్టారు. శామ్ కుర్రాన్‌కు 1 వికెట్ ద‌క్కింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM