మొబైల్స్ తయారీదారు ఒప్పో.. ఎ53ఎస్ 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఒప్పోకు చెందిన లేటెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను అమర్చారు. 8జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరా ఉంది. దీనికి తోడు మరో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా, ఇంకో 2 మెగాపిక్సల్ డెప్త్ కెమెరాలను కూడా వెనుకవైపు ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ కు ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపున ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు.
ఒప్పో ఎ53ఎస్ 5జి స్మార్ట్ ఫోన్ క్రిస్టల్ బ్లూ, ఇంక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,990 ఉండగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మెడల్ ధర రూ.16,990గా ఉంది. ఈ ఫోన్‌ను మే 2వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఆఫ్ లైన్ స్టోర్స్‌లో విక్రయిస్తారు.
లాంచింగ్ సందర్బంగా ఈ ఫోన్‌పై ఆఫర్లను అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో అయితే హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో రూ.1250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 1 ఏడాది పాటు ఎక్స్‌టెండెడ్ వారంటీని అందిస్తారు. కేవలం రూ.1కే 70 శాతం బై బ్యాక్ వాల్యూను అందిస్తారు. 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో అయితే పలు ప్రముఖ బ్యాంకులకు చెందిన కార్డులతో 5 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు. జీరో డౌన్ పేమెంట్‌తో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందిస్తారు. పేటీఎంతో కొనుగోలు చేస్తే 11 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…