భార‌త‌దేశం

భారీగా త‌గ్గిన బ్రాయిల‌ర్ చికెన్ ధ‌ర‌లు.. నాటుకోళ్లు, మ‌ట‌న్ ధ‌ర‌లు పైపైకి..

గ‌త కొద్ది రోజుల వ‌ర‌కు చికెన్ ధ‌ర మార్కెట్‌లో కేజీకి రూ.270 వ‌ర‌కు ప‌లికిన విష‌యం విదిత‌మే. అయితే ప్ర‌స్తుతం చికెన్ ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. కిలో రూ.170కి అమ్ముతున్నారు. అనేక రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్‌లు, లాక్‌డౌన్‌లు విధించ‌డం, వాణిజ్య ప‌ర‌మైన వినియోగం త‌గ్గ‌డం, రాత్రి క‌ర్ఫ్యూలు వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చికెన్ ధ‌ర‌లు భారీగా తగ్గాయి.

గ‌తేడాది క‌రోనా ప్ర‌భావం మొద‌ల‌య్యాక చికెన్ ధ‌ర‌లు అమాంతం ప‌డిపోయాయి. కానీ త‌రువాత చికెన్ తిన‌డం వ‌ల్ల క‌రోనా రాద‌ని, పైగా చికెన్ తింటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని చెప్ప‌డంతో ప్ర‌జ‌లు చికెన్ బాగా తిన‌డం మొద‌లు పెట్టారు. అయితే అప్ప‌టి నుంచి చికెన్ ధ‌ర‌లు కొద్దిగా పెరుగుతూ, కొద్దిగా త‌గ్గుతూ వ‌చ్చాయి. కానీ ప్ర‌స్తుతం ధ‌ర‌లు మ‌ళ్లీ ప‌డిపోయాయి.

క‌రోనా వ‌ల్ల చాలా చోట్ల ఆంక్ష‌ల‌ను విధించారు. ఫంక్ష‌న్లు, స‌భ‌లు, స‌మావేశాలు జ‌ర‌గ‌డం లేదు. హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌లోనూ వినియోగం త‌గ్గింది. దీంతో డిమాండ్ 30 శాతం వ‌ర‌కు త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. అందువల్లే చికెన్ ధ‌ర‌లు భారీగా ప‌డిపోయాయి. ఇక మ‌రోవైపు వేస‌విలో కోడిపిల్ల‌ల‌ను కాపాడ‌డం కూడా పౌల్ట్రీ రైతుల‌కు క‌ష్టంగా మారింది. సాధార‌ణంగా ఒక కోడికి రూ.90 వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టాలి. కానీ ప్ర‌స్తుతం కిలో బ‌రువున్న కోడిని రూ.66కే విక్ర‌యించాల్సి వస్తోంది. దీంతో పౌల్ట్రీ రైతులు భారీ న‌ష్టాల‌ను చ‌వి చూస్తున్నారు.

అయితే బ్రాయిల‌ర్ కోళ్ల ధ‌ర‌లు ప‌డిపోతున్న‌ప్ప‌టికీ మ‌రోవైపు నాటుకోళ్లు, మ‌ట‌న్‌ల‌కు గిరాకీ త‌గ్గ‌లేదు. ఇంకా పెరిగింది. దీంతో వాటి ధ‌ర‌లు పైపైకి వెళ్తున్నాయి. నాటుకోడి కేజీ ధ‌ర రూ.400 వ‌ర‌కు ప‌లుకుతోంది. క‌డ‌క్‌నాథ్ కోడి మాంసం అయితే కేజీకి రూ.500 పైగానే ప‌లుకుతోంది. ఇక మ‌ట‌న్ ధ‌ర రూ.800 వ‌ర‌కు ఉంది. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ లాక్ డౌన్ వైపు రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. అదే జరిగితే పౌల్ట్రీ రైతుల‌కు ఇంకా భారీ న‌ష్టాలు త‌ప్ప‌వ‌నే తెలుస్తోంది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గి వ్యాపారాలు మ‌ళ్లీ పుంజుకుంటేనే గానీ కోళ్ల ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం లేదు. అప్ప‌టి వ‌ర‌కు వేచి చూడాల్సిందేన‌ని పౌల్ట్రీ రైతులు అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM