50 మెగాపిక్స‌ల్ కెమెరా, 5జి ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన వ‌న్‌ప్ల‌స్ కొత్త ఫోన్‌..!

July 23, 2021 1:10 PM

మొబైల్స్ త‌యారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ మ‌రో కొత్త 5జి ఫోన్‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. త‌క్కువ ధ‌రకే అదిరిపోయే ఫీచ‌ర్లు క‌లిగిన ఫోన్ల‌ను త‌యారు చేసి అందిస్తుంద‌ని వ‌న్‌ప్ల‌స్‌కు మంచి పేరుంది. అందులో భాగంగానే అలాంటి ఫీచ‌ర్లు క‌లిగిన ఓ కొత్త ఫోన్‌ను వ‌న్‌ప్ల‌స్ లాంచ్ చేసింది. వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 2 5జి పేరిట ఆ ఫోన్ విడుద‌లైంది. అందులో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

OnePlus Nord 2 5G smart phone launched

వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 2 5జి ఫీచ‌ర్లు

  • 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఫ్లుయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే
  • 1080 x 2400 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజల్యూష‌న్‌, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
  • 3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెస‌ర్
  • 6/8/12 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11, డ్యుయ‌ల్ సిమ్
  • 50, 8, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  • ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
  • బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 2 5జి ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్ మోడ‌ల్ ధ‌ర రూ.27,999 ఉండ‌గా, 8జీబీ ర్యామ్ మోడ‌ల్ ధ‌ర రూ.29,999గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్ మోడ‌ల్ ధ‌ర రూ.34,999గా ఉంది. ఈ ఫోన్‌ను జూలై 26వ తేదీ నుంచి విక్ర‌యిస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో రూ.1000 డిస్కౌంట్‌ను అందిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment