గ్యాడ్జెట్స్

108 మెగాపిక్స‌ల్ కెమెరాతో లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 20 స్మార్ట్ ఫోన్లు..!

మోటోరోలా సంస్థ ఎడ్జ్ 20 సిరీస్‌లో రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను విడుద‌ల చేసింది. ఎడ్జ్ 20, ఎడ్జ్ 20 ఫ్యుష‌న్ పేరిట ఆ ఫోన్ల‌ను విడుద‌ల చేశారు. వీటిల్లో ప‌లు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

మోటోరోలా ఎడ్జ్ 20 ఫోన్‌లో.. 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజల్యూషన్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్ ల‌భిస్తుంది. ఆక్టాకోర్ స్నాప్ డ్రాగ‌న్ 778జి ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ ల‌భిస్తున్నాయి. ఆండ్రాయిడ్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఉంది. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు.

ఎడ్జ్ 20 ఫోన్‌లో.. వెనుక వైపు 108 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను అమ‌ర్చారు. దీనికి తోడుగా మ‌రో 16 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ టెలిఫొటో కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ముందు వైపు 32 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ప‌క్క వైపున ఇచ్చారు. 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

అలాగే మోటోరోలా ఎడ్జ్‌20 ఫ్యుష‌న్ స్మార్ట్‌ఫోన్‌లో.. 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేయ‌గా, దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యు ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ల‌భిస్తుంది. హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్‌ను ఇచ్చారు.

ఎడ్జ్‌20 ఫ్యుష‌న్ స్మార్ట్‌ఫోన్‌లో వెనుక వైపు 108 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. అలాగే దీనికి తోడు మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్ ల‌ను అమ‌ర్చారు. ముందు వైపు 32 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ప‌క్క వైపున ఉంది. 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచ‌ర్ల‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.

ఇక ఎడ్జ్ 20 స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.29,999 ఉండ‌గా, ఎడ్జ్ 20 ఫ్యుష‌న్ స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌ర రూ.21,499గా ఉంది, 8జీబీ ర్యామ్ మోడ‌ల్ ధ‌ర రూ.22,999గా ఉంది. వీటిని ఈ నెల 27వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ లో విక్ర‌యించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM