రూ.9,999కే ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్ స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

May 21, 2021 2:29 PM

మొబైల్స్ త‌యారీదారు ఇన్ఫినిక్స్.. హాట్ 10 ఎస్ పేరిట భార‌త్‌లో ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో 6.82 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జి85 ప్రాసెస‌ర్, 6జీబీ ర్యామ్ ల‌ను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ల‌భిస్తుంది. వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాతోపాటు మ‌రో 2 మెగాపిక్స‌ల్ పోర్ట్రెయిట్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ల‌భిస్తుంది.

Infinix Hot 10S smart phone launched in india

ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్ ఫీచ‌ర్లు

  • 6.82 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1640 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి85 ప్రాసెస‌ర్
  • 4/6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, డ్యుయ‌ల్ సిమ్
  • ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌, 48, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
  • 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
  • డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

ఇన్ఫినిక్స్ హాట్ 10 ఎస్ స్మార్ట్ ఫోన్ మొరండి గ్రీన్‌, 7 డిగ్రీ ప‌ర్పుల్‌, హార్ట్ ఆఫ్ ఓషియ‌న్‌, 95 డిగ్రీ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.9,999 ఉండ‌గా, 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.10,999గా ఉంది. ఈ ఫోన్‌ను మే 27వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యిస్తారు. మొద‌టి సేల్‌లో ఈ ఫోన్‌పై రూ.500 డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment