కేవ‌లం రూ.7,999 ధ‌ర‌కే ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే స్మార్ట్ ఫోన్‌..!

July 20, 2021 9:58 PM

మొబైల్స్ త‌యారీదారు ఇన్ఫినిక్స్ భార‌త్‌లో హాట్ 10 ప్లే పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఈ ఫోన్కు గాను 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్‌ను ఎప్పుడో లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ఇదే ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడ‌ల్‌ను ఆ సంస్థ విడుద‌ల చేసింది. ఇందులో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

Infinix HOT 10 Play smart phone launched in India

ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే ఫీచ‌ర్లు

  • 6.82 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1640 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
  • ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌
  • 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, డ్యుయ‌ల్ సిమ్
  • ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
  • 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే స్మార్ట్ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.7,999గా ఉంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment