Flipkart : ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌.. 70 శాతం మేర త‌గ్గింపు ధ‌ర‌లు..

December 13, 2021 7:56 PM

Flipkart : ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మ‌రో సేల్‌ను ప్ర‌క‌టించింది. డిసెంబ‌ర్ 16 నుంచి 21వ తేదీ వ‌ర‌కు బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ప్ల‌స్ తోపాటు రెగ్యుల‌ర్ క‌స్ట‌మ‌ర్లు ఉచితంగా వ‌స్తువుల‌ను డెలివ‌రీ అందుకోవ‌చ్చు. అలాగే ఎస్‌బీఐ కార్డుల‌తో అద‌నంగా మ‌రో 10 శాతం డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు.

Flipkart announces big saving days sale know when it starts

ఈ సేల్‌లో ట్యాబ్‌ల‌పై 40 శాతం, స్మార్ట్ వాచ్‌ల‌పై 60, టీవీల‌పై 70, గృహోప‌క‌ర‌ణాల‌పై 50 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందించ‌నున్నారు. సేల్ లో భాగంగా ప్ర‌తి రోజూ రాత్రి 12 నుంచి ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు తిరిగి సాయంత్రం 4 గంట‌ల‌కు క్రేజీ డీల్స్ అందుబాటులో ఉంటాయి.

ఇక ఫ్లిప్ కార్ట్ ప్ల‌స్ మెంబ‌ర్ల‌కు సేల్ కొంత ముందుగానే అందుబాటులోకి వ‌స్తుంది. అయితే ఈ మెంబ‌ర్‌షిప్‌ను కొనుక్కోలేరు. అందులో 200 సూప‌ర్ కాయిన్స్ ఉంటే మెంబ‌ర్ షిప్‌ను రిడీమ్ చేయ‌వ‌చ్చు. కాయిన్లు రావాలంటే వ‌స్తువుల‌ను కొనాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment