ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తాను ఉత్పత్తి చేస్తున్న ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రొ ఫోన్లలో చిన్నపాటి సమస్యలు వచ్చినట్లు గుర్తించింది. అందుకనే ఈ ఫోన్లను వాడుతున్న వారికి ప్రపంచ వ్యాప్తంగా ఉచితంగా సర్వీస్ చేసి ఇస్తామని యాపిల్ ప్రకటించింది. సదరు ఫోన్లలో ఆడియో సమస్యలు వస్తున్నట్లు తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రొ ఫోన్లలో రిసీవర్ మాడ్యూల్‌లో ఆడియో ఇష్యూస్ వచ్చాయని యాపిల్ తెలియజేసింది. అందువల్లే ఉచితంగా ఆ ఫోన్లను రిపేర్ చేసి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆయా ఫోన్లలో యూజర్లు కాల్స్ చేసినప్పుడు, కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎలాంటి సౌండ్ అవుట్‌పుట్ రావడం లేదు. అక్టోబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 మధ్య ఉత్పత్తి అయిన ఫోన్లలోనే ఈ సమస్య వస్తుందని యాపిల్ తెలియజేసింది. అందువల్ల ఆయా తేదీల్లో ఉత్పత్తి అయిన ఐఫోన్ 12, 12 ప్రొ ఫోన్లను వాడుతున్న వారు తమ ఫోన్లలోనూ పైన తెలిపిన సమస్య వస్తుంటే వారు వెంటనే యాపిల్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఉచితంగా రిపేర్ చేయించుకోవచ్చు.
అయితే ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ మోడల్స్ లో ఈ సమస్య లేదని, పైన తెలిపిన రెండు మోడల్స్‌లోనే ఈ సమస్య ఉందని యాపిల్ తెలియజేసింది. కనుక యూజర్లు తమకు సమీపంలో ఉన్న యాపిల్ ఆథరైడ్జ్ సర్వీస్ సెంటర్‌లో ఉచితంగానే ఆ ఫోన్లను రిపేర్ చేయించుకోవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…