ఆ ఐఫోన్ల‌కు ఉచితంగా సర్వీస్‌.. ప్ర‌క‌టించిన యాపిల్‌..!

August 31, 2021 7:03 PM

ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ తాను ఉత్ప‌త్తి చేస్తున్న ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రొ ఫోన్ల‌లో చిన్న‌పాటి స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ట్లు గుర్తించింది. అందుక‌నే ఈ ఫోన్ల‌ను వాడుతున్న వారికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉచితంగా స‌ర్వీస్ చేసి ఇస్తామ‌ని యాపిల్ ప్ర‌క‌టించింది. స‌ద‌రు ఫోన్ల‌లో ఆడియో స‌మ‌స్యలు వ‌స్తున్న‌ట్లు తెలిపింది.

ఆ ఐఫోన్ల‌కు ఉచితంగా సర్వీస్‌.. ప్ర‌క‌టించిన యాపిల్‌..!

ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రొ ఫోన్ల‌లో రిసీవ‌ర్ మాడ్యూల్‌లో ఆడియో ఇష్యూస్ వ‌చ్చాయ‌ని యాపిల్ తెలియ‌జేసింది. అందువ‌ల్లే ఉచితంగా ఆ ఫోన్ల‌ను రిపేర్ చేసి ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది. ఆయా ఫోన్ల‌లో యూజ‌ర్లు కాల్స్ చేసిన‌ప్పుడు, కాల్స్ రిసీవ్ చేసుకున్న‌ప్పుడు ఎలాంటి సౌండ్ అవుట్‌పుట్ రావ‌డం లేదు. అక్టోబ‌ర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 మ‌ధ్య ఉత్ప‌త్తి అయిన ఫోన్ల‌లోనే ఈ స‌మ‌స్య వ‌స్తుంద‌ని యాపిల్ తెలియ‌జేసింది. అందువ‌ల్ల ఆయా తేదీల్లో ఉత్ప‌త్తి అయిన ఐఫోన్ 12, 12 ప్రొ ఫోన్ల‌ను వాడుతున్న వారు త‌మ ఫోన్ల‌లోనూ పైన తెలిపిన స‌మ‌స్య వ‌స్తుంటే వారు వెంట‌నే యాపిల్ ఆథ‌రైజ్డ్ స‌ర్వీస్ సెంట‌ర్‌కు వెళ్లి ఉచితంగా రిపేర్ చేయించుకోవ‌చ్చు.

అయితే ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ మోడ‌ల్స్ లో ఈ స‌మ‌స్య లేద‌ని, పైన తెలిపిన రెండు మోడ‌ల్స్‌లోనే ఈ స‌మ‌స్య ఉంద‌ని యాపిల్ తెలియ‌జేసింది. క‌నుక యూజ‌ర్లు త‌మ‌కు స‌మీపంలో ఉన్న యాపిల్ ఆథ‌రైడ్జ్ సర్వీస్ సెంట‌ర్‌లో ఉచితంగానే ఆ ఫోన్ల‌ను రిపేర్ చేయించుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now