సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ముందు వరుసలో ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసిన మెగాస్టార్ చిరంజీవి ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఆర్థిక సహాయం కూడా చేశారు. అయితే ఆయన చేసిన సహాయం బయటికి చెప్పుకోవడం ఇష్టం ఉండదు. కానీ ఆయన చేసిన సహాయాన్ని మాత్రం ఎవరూ మరిచిపోరు.
మెగాస్టార్ అభిమాని డి సురేష్ 2010వ సంవత్సరంలో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి అతని కుటుంబాన్ని పరామర్శించి అతని కూతురు అశ్వితను చదివించే బాధ్యత తనదని, ఆమె చదువు పూర్తయ్యే వరకు తన సొంత ఖర్చులతో చదివిస్తానని మాట ఇచ్చారు. ఈ విధంగా మెగాస్టార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
ఈక్రమంలోనే అశ్వితను గత పది సంవత్సరాల నుంచి భారత సేవా సహకార ఫోరం అధ్యక్షుడు బసవరాజు శ్రీనివాస్ ద్వారా చదివిస్తున్నారు. ప్రతియేటా అశ్విత స్కూల్ కి సంబంధించిన ఫీజులను చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాదికి సంబంధించిన అశ్విత స్కూల్ ఫీజు పది వేల రూపాయల చెక్కును అందించడమే కాకుండా తను జీవితంలో ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఈ సందర్భంగా మెగాస్టార్ కోరుకున్నారు. కేవలం ఇది మాత్రమే కాకుండా ఇలా ఎంతో మందికి సహాయం చేస్తూ ఎంతో గొప్ప మనసును మెగాస్టార్ చిరంజీవి చాటుకుంటున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…