టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. వారి కోసం ఎయిర్‌టెల్ కొత్తగా పలు ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. ఈ ప్లాన్లను రీచార్జి చేసుకుంటే ఏడాది వ్యవధి గల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.
ఎయిర్‌టెల్ సంస్థ కొత్తగా రూ.499, రూ.699, రూ.2798 ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇవి ప్రీపెయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. రూ.499 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే రోజుకు 3జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. దీంతోపాటు 1 ఏడాది వ్యవధి గల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే అపోలో 24/7 సర్కిల్ 3 నెలల మెంబర్‌షిప్ ఉచితంగా వస్తుంది. దీంతోపాటు షా అకాడమీ నుంచి ఉచిత కోర్సులు లభిస్తాయి.
ఇక రూ.699 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. రూ.2798 ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. కాల్స్, మెసేజ్ లు కూడా వస్తాయి. ఇక రూ.699, రూ.2798 ప్లాన్లకు కూడా హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా వస్తుంది. రూ.499 ప్లాన్ వాలిడిటీ 28 రోజులు ఉండగా, రూ.699 ప్లాన్ వాలిడిటీ 56 రోజులుగా ఉంది. రూ.2798 ప్లాన్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు.
అయితే ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్‌ను వాడుతున్న కస్టమర్లు రూ.499 ఆపైన విలువ గల ప్లాన్‌లను తీసుకుంటే వారికి ఎలాంటి అదనపు చార్జి లేకుండానే హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఇందుకు గాను వారు ఎయిర్ టెల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో ఇచ్చే థ్యాంక్స్ బెనిఫిట్స్ ను క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…