ఢిల్లీలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 28వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తడబడింది. ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఏ దశలోనూ పరుగులు చేద్దామని హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ అనుకోలేదు. చెత్త షాట్లు ఆడి వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో హైదరాబాద్‌పై రాజస్థాన్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో రాజస్థాన్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లలో జాస్ బట్లర్, కెప్టెన్ సంజు శాంసన్‌లు రాణించారు. 64 బంతుల్లో బట్లర్ 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 124 పరుగులు చేశాడు. 33 బంతుల్లో శాంసన్ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, రషీద్ ఖాన్, విజయ్ శంకర్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 165 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహమాన్, క్రిస్ మోరిస్‌లు 3 వికెట్ల చొప్పున పడగొట్టారు. కార్తీక్ త్యాగి, రాహుల్ తెవాతియాలకు చెరొక వికెట్ దక్కింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…