ఐపీఎల్

ఐపీఎల్ 2021: తీరు మార్చుకోని హైద‌రాబాద్‌.. ముంబై గెలుపు..!

చెన్నైలో జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 టోర్నీ 9వ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ గెలుపొందింది. ముంబై నిర్దేశించిన ఒక మోస్త‌రు ల‌క్ష్యాన్ని కూడా హైద‌రాబాద్ ఛేదించ‌లేక చేతులెత్తేసింది. గ‌త మ్యాచ్‌లో లాగానే హైద‌రాబాద్ బ్యాట్స్‌మెన్ చెత్త షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారు. బౌల‌ర్లు చ‌క్క‌ని ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచి ప్ర‌త్య‌ర్థుల‌ను త‌క్కువ స్కోర్ల‌కే క‌ట్ట‌డి చేసినా బ్యాట్స్‌మెన్ మాత్రం విఫ‌ల‌మ‌య్యారు. ఈ మ్యాచ్‌లోనూ హైద‌రాబాద్ బ్యాట్స్‌మెన్ అలాగే విఫ‌ల‌మ‌య్యారు. దీంతో హైద‌రాబాద్‌పై ముంబై 13 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 150 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో క్వింట‌న్ డికాక్‌, కిర‌న్ పొల్లార్డ్‌, రోహిత్ శ‌ర్మ‌లు రాణించారు. 39 బంతుల్లో 5 ఫోర్ల‌తో డికాక్ 40 ప‌రుగులు చేయ‌గా, 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో రోహిత్ 32 ప‌రుగులు చేశాడు. పొల్లార్డ్ 22 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స‌ర్ల‌తో 35 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో ముజీబ్ ఉర్ ర‌హ‌మ‌న్, విజ‌య్ శంక‌ర్‌లు చెరో 2 వికెట్ల చొప్పున తీశారు. ఖ‌లీల్ అహ్మ‌ద్‌కు 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ 19.4 ఓవ‌ర్ల‌లో ఆలౌట్ అయింది. 137 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో డేవిడ్ వార్న‌ర్‌, జానీ బెయిర్‌స్టోలు మాత్ర‌మే రాణించారు. 34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల‌తో వార్న‌ర్ 36 ప‌రుగులు చేయ‌గా, 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో బెయిర్ స్టో 43 ప‌రుగులు చేశాడు. ముంబై బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహ‌ర్‌లు చెరో 3 వికెట్ల చొప్పున‌ ప‌డ‌గొట్టారు. జ‌స్‌ప్రిత్ బుమ్రా, క్రునాల్ పాండ్యాల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM