దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. అంతా సద్దుమణిగింది అనుకుంటున్న వేళ కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా రోజుకు 2 లక్షల కన్నా ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయంటే కరోనా ఎంత తీవ్రంగా వ్యాప్తి చెందుతుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే కరోనా ఇంతలా వ్యాప్తి చెందడానికి ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పలు కారణాలను వివరించారు.
దేశంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. దీంతో కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ క్రమంలో ప్రజలు కోవిడ్ జాగ్రత్తలను పాటించడం మరిచారు. ఇదే కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందేందుకు, ఉత్పరివర్తనం చెందేందుకు కారణం అయింది. అందువల్లే కోవిడ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది.. అని గులేరియా అన్నారు.
ఇక దేశంలో అనేక చోట్ల ఎన్నికలు జరుగుతుండడం, ఇతర సభలు, సమావేశాలు, కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు కోవిడ్ జాగ్రత్తలను పాటించకపోవడం, వ్యాక్సిన్ తీసుకున్నవారు నిర్లక్ష్యంగా ఉండడం వంటి కారణాల వల్ల కూడా కోవిడ్ వ్యాప్తి ఎక్కువైందని గులేరియా అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ వ్యాక్సిన్ కోవిడ్ నుంచి మనకు 100 శాతం రక్షణను అందివ్వదని, కానీ కోవిడ్ బారిన పడితే తీవ్ర ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయని అన్నారు. అందువల్ల ప్రజలందరూ కోవిడ్ జాగ్రత్తలను కచ్చితంగా పాటించాల్సిందేనన్నారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…