దేశంలో కోవిడ్ కేసులు అందుకే పెరుగుతున్నాయి.. కార‌ణాలు చెప్పిన ఎయిమ్స్ డైరెక్ట‌ర్‌..

April 18, 2021 11:34 AM

దేశంలో క‌రోనా విల‌య‌తాండవం చేస్తోంది. అంతా స‌ద్దుమ‌ణిగింది అనుకుంటున్న వేళ క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దేశ‌వ్యాప్తంగా రోజుకు 2 ల‌క్ష‌ల కన్నా ఎక్కువ‌గా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయంటే క‌రోనా ఎంత తీవ్రంగా వ్యాప్తి చెందుతుందో అర్ధం చేసుకోవ‌చ్చు. అయితే క‌రోనా ఇంత‌లా వ్యాప్తి చెంద‌డానికి ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా ప‌లు కార‌ణాల‌ను వివ‌రించారు.

aiims director guleria told why covid cases are rising

దేశంలో జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి నెల‌ల్లో వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మైంది. దీంతో కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు కోవిడ్ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం మ‌రిచారు. ఇదే కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందేందుకు, ఉత్ప‌రివ‌ర్త‌నం చెందేందుకు కార‌ణం అయింది. అందువ‌ల్లే కోవిడ్ కేసుల సంఖ్య భారీగా న‌మోదవుతోంది.. అని గులేరియా అన్నారు.

ఇక దేశంలో అనేక చోట్ల ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డం, ఇత‌ర స‌భ‌లు, స‌మావేశాలు, కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించేట‌ప్పుడు కోవిడ్ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌క‌పోవ‌డం, వ్యాక్సిన్ తీసుకున్న‌వారు నిర్ల‌క్ష్యంగా ఉండ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల కూడా కోవిడ్ వ్యాప్తి ఎక్కువైంద‌ని గులేరియా అన్నారు. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న ఏ వ్యాక్సిన్ కోవిడ్ నుంచి మ‌న‌కు 100 శాతం ర‌క్ష‌ణ‌ను అందివ్వ‌ద‌ని, కానీ కోవిడ్ బారిన ప‌డితే తీవ్ర ప్రాణాపాయ ప‌రిస్థితులు త‌లెత్త‌కుండా ఉంటాయ‌ని అన్నారు. అందువ‌ల్ల ప్ర‌జ‌లంద‌రూ కోవిడ్ జాగ్ర‌త్త‌ల‌ను క‌చ్చితంగా పాటించాల్సిందేన‌న్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment