ఐపీఎల్

IPL 2021 : ధోనీ టీమ్ మ్యాజిక్‌.. క్లిష్ట స్థితిలో ఉన్న‌ప్ప‌టికీ కోలుకుని మ‌రీ ముంబైపై గెలిచారు..!

IPL 2021 : క‌రోనా కార‌ణంగా ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో జ‌ర‌గాల్సిన ఐపీఎల్ 2021 వాయిదా ప‌డి తాజాగా మ‌ళ్లీ మొద‌లైంది. ఆదివారం నాటి మ్యాచ్‌తో మ‌రోసారి ఐపీఎల్ జోష్ తెచ్చింది. మొద‌టి ద‌శ‌లో 29 మ్యాచ్‌లు జ‌ర‌గ్గా ఆదివారం 30వ మ్యాచ్ తో మ‌ళ్లీ ఐపీఎల్ ప్రారంభ‌మైంది. ఈ క్ర‌మంలోనే ఈ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ముంబైలు త‌ల‌ప‌డ‌గా.. విజ‌యం చెన్నైని వ‌రించింది.

టాస్ గెలిచిన చెన్నై ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆ జ‌ట్టు 6 వికెట్ల న‌ష్టానికి 156 ప‌రుగులు చేసింది. ఓ ద‌శ‌లో 24 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి అత్యంత క్లిష్ట ప‌రిస్థితిలో ఉన్న చెన్నైని ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్‌, ర‌వీంద్ర జ‌డేజా, బ్రేవోలు ఆదుకున్నారు. 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో రుతురాజ్ 88 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌గా, జ‌డేజా 26, బ్రేవో 23 ప‌రుగులు చేశారు. దీంతో చెన్నై చెప్పుకోద‌గిన స్కోరు చేయ‌గ‌లిగింది. ముంబై బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్‌, ఆడ‌మ్ మిల్నె, బుమ్రాల‌కు త‌లా 2 వికెట్లు ద‌క్కాయి.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 136 ప‌రుగుల‌ను మాత్ర‌మే చేయ‌గలిగింది. ముంబై బ్యాట్స్‌మెన్‌ల‌లో సౌర‌భ్ తివారీ ఒక్కడే రాణించాడు. మిగిలిన ఎవ‌రూ ఆక‌ట్టుకోలేక‌పోయారు. 40 బంతులు ఆడిన తివారీ 5 ఫోర్ల‌తో 50 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చెన్నై బౌల‌ర్ల‌లో బ్రేవో 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, దీప‌క్ చాహ‌ర్ 2 వికెట్లు తీశాడు. జోష్ హేజ‌ల్‌వుడ్‌, శార్దూల్ ఠాకూర్‌ల‌కు చెరొక వికెట్ ద‌క్కింది. ఈ క్ర‌మంలో ముంబైపై చెన్నై 20 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM