ఐపీఎల్ చెన్నై టీం ప్లేయ‌ర్ల కొత్త జెర్సీ.. లోగోపై 3 స్టార్స్‌.. వాటికి అర్థం ఏమిటంటే..? ‌

March 30, 2021 5:38 PM

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా వేస‌విలో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. క‌రోనా వ‌ల్ల గ‌తేడాది వేస‌విలో జ‌ర‌గాల్సిన ఐపీఎల్ 13వ ఎడిష‌న్‌ను వాయిదా వేసి సెప్టెంబ‌ర్ – నవంబ‌ర్ నెల‌ల మ‌ధ్య దుబాయ్‌లో నిర్వ‌హించారు. ఇక ఈసారి 14వ ఎడిష‌న్‌ను భార‌త్‌లోనే నిర్వ‌హిస్తున్నారు. కాక‌పోతే ప్రేక్ష‌కులు లేకుండానే ఈసారి ఐపీఎల్ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో జ‌ట్ల‌న్నీ ఇప్ప‌టికే ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొద‌లు పెట్టేశాయి.

chennai team jersey new look 3 stars logo and their meaning

అయితే చెన్నై సూప‌ర్ కింగ్స్ టీమ్ చాలా రోజుల త‌రువాత త‌మ జ‌ట్టు ఆట‌గాళ్ల జెర్సీ లుక్‌ను మార్చింది. జెర్సీపై కొత్త కంపెనీల‌కు చెందిన స్పాన్స‌ర్‌షిప్ లోగోల‌తోపాటు జెర్సీ భుజాల‌పై ఇండియ‌న్ ఆర్మీ యూనిఫాంను ప్ర‌తిబింబించే విధంగా డిజైన్ చేశారు. ఇక చెన్నై సూప‌ర్ కింగ్స్ లోగోపై 3 స్టార్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఆ స్టార్స్ ఏమిటా అని కొంద‌రు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. కానీ అందులో పెద్ద విష‌యం ఏమీ లేదు. చెన్నై ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలిచింది క‌దా. 2010, 2011, 2018ల‌లో ఐపీఎల్‌ను గెలుచుకుంది. దీంతో ఆ విజ‌యాల‌ను ప్ర‌తిబింబించేలా ఆ 3 స్టార్స్‌ను లోగోల‌పై డిజైన్ చేశారు.

ఇక గ‌త సీజ‌న్‌లో చెన్నై టీమ్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న చూపింది. మొత్తం 14 మ్యాచ్‌ల‌లో కేవ‌లం 6 మ్యాచ్‌ల‌ను మాత్ర‌మే గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో 7వ స్థానంలో నిలిచింది. ఆ సీజ‌న్‌లో ఐపీఎల్ ప్రారంభానికి ముందు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో సురేష్ రైనా త‌ప్పుకోవ‌డం జ‌ట్టుకు మైన‌స్ అయింది. అయితే ఈసారి మాత్రం చెన్నై టీమ్ మునుప‌టిలా విజృంభించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. మ‌రి వారు ఆశిస్తున్న‌ట్లు జ‌రుగుతుందా, లేదా ? అన్న‌ది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment