చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 టోర్నీ 6వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని కూడా హైదరాబాద్ ఛేదించలేక చతికిలబడింది. పేలవమైన ఆట తీరును ప్రదర్శించింది. దీంతో హైదరాబాద్‌పై బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచి హైదరాబాద్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా బెంగళూరు బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో గ్లెన్ మాక్స్‌వెల్, కోహ్లిలు రాణించారు. 41 బంతులు ఆడిన మాక్స్‌వెల్ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేయగా 29 బంతుల్లో కోహ్లి 4 ఫోర్లతో 33 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 3 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్, షాబాజ్ నదీమ్, టి.నటరాజన్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో డేవిడ్ వార్నర్, మనీష్ పాండేలు రాణించారు. 37 బంతులు ఆడిన వార్నర్ 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 54 పరుగులు చేయగా, 39 బంతులు ఆడిన పాండే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో షాబాద్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టాడు. హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్ లు చెరో 2 వికెట్లు తీశారు. కైలీ జేమిసన్‌కు 1 వికెట్ దక్కింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…