తెలంగాణ

నిజాయితీ కూరగాయలు.. అక్కడ మనుషులు ఉండరు డబ్బులు తీసుకోరు.. కానీ!

సాధారణంగా ఒక వ్యాపారం చేయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. వ్యాపారంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జాగ్రత్తగా ఒకరు దగ్గరుండి వ్యాపారాన్ని చూసుకుంటారు. కానీ ఇక్కడ ఒక రైతు మాత్రం నమ్మకం, నిజాయితీని తన పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నాడు. తను చేసేది కూరగాయలు వ్యాపారమే అయినా అక్కడ యజమాని ఉండడు, డబ్బులు తీసుకోడు కానీ వ్యాపారం మాత్రం చేస్తాడు. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే…

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌ రైతు మల్లారెడ్డి అనే రైతు కూరగాయలు, పండ్లతోట పెంపకం చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో కూరగాయల ధరలు పడిపోవడంతో ఎంతో నష్టం ఎదుర్కొంటున్న రైతుకు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. దీంతో ఆ రైతు తోట సమీపంలోనే జగిత్యాల-గొల్లపల్లి రహదారిపై “నిజాయితీ” అనే పేరుతో కూరగాయల దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. ఈ దుకాణంలో తన తోటలో పండే కూరగాయలను అక్కడ ఉంచి వాటి ధరలను బోర్డుపై రాసి, డబ్బులు వేయడానికి ఒక డబ్బా అక్కడ ఉంచి తోట పనికి వెళ్తాడు.

ఈ విధంగా ఆ రహదారిపై వెళ్లే వారు వారికి కావలసిన కూరగాయలను సొంతంగా తీసుకొని వాటి ధరలను అక్కడ ఉన్న డబ్బాలో వేస్తారు. ఇక ప్రస్తుత కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉండటం వల్ల ఫోన్ పే, గూగుల్ పే వంటి సౌకర్యాలను కూడా అందుబాటులో ఉంచాడు. అయితే అక్కడ ఎవరూ కూడా ఎలాంటి మోసం చెయ్యరని రైతు తెలిపాడు. ఈ క్రమంలోనే అక్కడ ఎవరు ఉండకపోవడానికి కారణం ఏంటని అడగగా.. అక్కడ ఒక వ్యక్తి కూర్చుంటే రోజుకు ఒక మనిషికి కూలి వృధా అవుతుంది కనుక అక్కడ ఈ విధమైన సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ విధంగా ప్రతి రోజు రైతు 200 నుంచి 500 రూపాయల వరకు ఆదాయం పొందుతున్నట్లు తెలిపాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM