క్రికెట్

రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!

జ‌న‌వ‌రి 23, 2026న రాయ్‌పూర్‌లో జ‌రిగిన భార‌త్ వ‌ర్సెస్ న్యూజిలాండ్‌ 2వ టీ20 మ్యాచ్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌. Photo Credit: AFP/Getty Images.

రాయ్‌పూర్ వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని భార‌త్ అల‌వోక‌గా ఛేదించింది. ఓపెన‌ర్లు త్వ‌ర‌గా ఔట్ అయిన‌ప్ప‌టికీ ఆ త‌రువాత వ‌చ్చిన బ్యాట్స్‌మెన్ నిల‌క‌డ‌గా ఆడారు. సింగిల్స్‌, డ‌బుల్స్ తీస్తూనే అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా చెత్త బంతుల‌ను బౌండరీల‌కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో భార‌త్ టీ20 వ‌ర‌ల్డ్ కప్‌కు ముందు అద్భుత‌మైన ఫామ్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. న్యూజిలాండ్ బౌల‌ర్లు తొలి 2 ఓవ‌ర్ల‌లో పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ల‌ను తీసినా ఆ త‌రువాత ఆ ఆరంభాన్ని వారు నిల‌బెట్టుకోలేక‌పోయారు. ప‌రుగుల‌ను అధికంగా స‌మ‌ర్పించుకున్నారు. దీంతో భార‌త్ అధిక ర‌న్ రేట్‌తో పోరాడింది. న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

కివీస్ భారీ స్కోరు..

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 208 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. ఆ జ‌ట్టు ప్లేయ‌ర్ల‌లో కెప్టెన్ మిచెల్ శాంట‌న‌ర్ 27 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 47 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే మ‌రో ప్లేయ‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 44 ప‌రుగులు చేశాడు. అలాగే మిగిలిన బ్యాట్స్‌మెన్ కూడా వ‌చ్చిన వారు వ‌చ్చిన‌ట్లే బౌండ‌రీల‌ను బాదుతూ స్కోరు బోర్డును ఉర‌కెత్తించారు. దీంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేయ‌గ‌లిగింది. భార‌త బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, హార్దిక్ పాండ్యా, హ‌ర్షిత్ రాణా, వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి, శివం దూబె త‌లా 1 వికెట్ తీశారు.

ఆదుకున్న ఇషాన్ కిష‌న్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌..

అనంత‌రం 209 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో ఛేద‌న ఇన్నింగ్స్ ప్రారంభించిన భార‌త్‌కు ఆదిలోనే దెబ్బ త‌గిలింది. ఓపెన‌ర్ సంజు శాంస‌న్ తొలి ఓవ‌ర్‌లోనే మ్యాట్ హెన్రీ బౌలింగ్ లో అవుట్ అయి వెనుదిరిగాడు. మ‌రుస‌టి ఓవ‌ర్‌లో మ‌రో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ సైతం ప‌రుగులు లేమీ చేయ‌కుండానే డ‌కౌట్‌గా పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. అయితే త‌రువాత వ‌చ్చిన ఇషాన్ కిష‌న్‌, కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ నిల‌క‌డ‌గా ఆడారు. ఓ వైపు బౌండ‌రీల‌ను బాదుతూనే మ‌ధ్య మ‌ధ్య‌లో సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశారు. ఈ క్ర‌మంలో సూర్య‌కుమార్ యాద‌వ్ 37 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 82 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌గా, ఇషాన్ కిష‌న్ 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 76 ప‌రుగులు చేసి భార‌త్ విజ‌యానికి బాట‌లు వేశాడు. ఇక ఆ త‌రువాత వ‌చ్చిన శివం దూబె 18 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స‌ర్ల‌తో 36 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌డ‌మే కాకుండా ఇషాన్ కిష‌న్ అనంత‌రం మ‌రో వికెట్ ప‌డ‌కుండా సూర్య‌కుమార్‌కు చ‌క్క‌ని స‌హ‌కారం అందించి మ్యాచ్ ముగిసే వ‌ర‌కు క్రీజులో నిలిచాడు. ఈ క్ర‌మంలో భార‌త్ కేవ‌లం 15.2 ఓవ‌ర్ల‌లోనే 3 వికెట్ల‌ను కోల్పోయి 209 ప‌రుగులు చేసింది. ల‌క్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఇక కివీస్ బౌల‌ర్ల‌లో మ్యాట్ హెన్రీ, జేక‌బ్ డ‌ఫ్ఫీ, ఇష్ సోధిల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

సిరీస్‌లో 2-0 ఆధిక్యం..

రాయ్‌పూర్‌లో జ‌రిగిన 2వ టీ20లో భార‌త్ విజ‌యం సాధించ‌డంతో 5 మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యానికి చేరింది. తొలి టీ20 మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ 238 ప‌రుగుల భారీ స్కోరు చేసి అనంత‌రం దాన్ని కాపాడుకోవ‌డంలో స‌క్సెస్ అయింది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. త‌ద్వారా త‌మ ఛేజింగ్ బలాన్ని టెస్ట్ చేద్దామ‌ని భావిస్తున్నామ‌ని కెప్టెన్ సూర్య‌కుమార్ యాదవ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ స‌మ‌యంలో తెలిపాడు. అయితే న్యూజిలాండ్ భారీ ల‌క్ష్యాన్ని ఉంచ‌డంతో భార‌త్ ఆ స్కోరును సాధిస్తుందా అని అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు తొలి 2 ఓవ‌ర్ల‌లో వ‌రుస‌గా వికెట్ల‌ను కూడా కోల్పోయింది. అయితే ఇషాన్ కిష‌న్‌, సూర్య‌కుమార్ యాద‌వ్ మ‌రో వికెట్ ప‌డ‌కుండా విజ‌యాన్ని దాదాపుగా ఖ‌రారు చేశారు. ఆ త‌రువాత కిష‌న్ అవుట్ అయిన వెంట‌నే క్రీజులోకి వ‌చ్చిన దూబె చివ‌రి వ‌ర‌కు సూర్య‌తో నిలిచి మ్యాచ్‌ను ముగించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM

త్రిష వర్సెస్ పార్థిబన్.. నటి సీరియస్ కౌంటర్! ‘మైక్ ఉంటే ఏదైనా మాట్లాడతారా?’

త‌మిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను న‌టి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేర‌కు త్రిష త‌న…

Monday, 9 March 2026, 3:22 PM

బెంగళూరులో ఎన్టీఆర్ మేనియా.. ఆసుపత్రి ఓపెనింగ్‌లో భారీ తోపులాట, ఎస్కలేటర్ ధ్వంసం!

నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…

Monday, 9 March 2026, 10:01 AM

బెల్లంకొండ ఇంట్లో పెళ్లి సందడి.. వైభవంగా శ్రీనివాస్ నిశ్చితార్థం..

టాలీవుడ్ న‌టుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్ట‌నున్నారు. త‌న ప్రియురాలు కావ్య‌తో ఆయ‌న నిశ్చితార్థం ఆదివారం (మార్చి…

Sunday, 8 March 2026, 8:36 PM

‘సోషల్ మీడియాకు దూరం’.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు! ఫైనల్‌కు ముందు అసలు రహస్యం ఇదే.

ఒత్తిడిని త‌గ్గించుకునేందుకు తాను ఫోన్‌నే కాదు, సోష‌ల్ మీడియాను కూడా దూరంగా పెట్టాన‌ని, ఇప్ప‌టికీ సామాజిక మాధ్య‌మాల‌ను చూడ‌డం లేద‌ని…

Sunday, 8 March 2026, 5:30 PM