Eating Non Veg Foods : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది అనేక వెరైటీలకు చెందిన నాన్ వెజ్ వంటలను ఆరగించేస్తుంటారు. రుచిని బట్టి చికెన్, మటన్, చేపలు, రొయ్యలు.. ఇలా తింటుంటారు. అయితే చాలా మందికి ఎప్పటి నుంచో ఒక సందేహం ఉంది. అదేమిటంటే.. ఆదివారం మాంసాహారం తినవచ్చా.. దీని గురించి ఎవరైనా ఏమైనా చెప్పారా.. మాంసాహారాన్ని ఆదివారం తింటే ఏమవుతుంది.. వంటి అనేక ప్రశ్నలు వస్తుంటాయి. అయితే ఇందుకు పురాణాలు చెబుతున్న సమాధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వ కాలంలో ఆదివారం రోజు సూర్యుడికి పూజలు చేసేవారు. ఆయన సమస్త ప్రాణికోటికి వెలుగును, శక్తిని అందించే ప్రదాత. కనుక సూర్య దేవున్ని పూజించేవారు. అందువల్ల ఆదివారం మాంసాహారం తినేవారు కాదు. ఇక వాస్తు ప్రకారం కూడా ఆదివారం సూర్యుని నుంచి మనలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందట. అది మనల్ని ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంచుతుందట. అలాంటి సమయంలో మాంసాహారం తింటే మనకు నష్టం జరుగుతుందట. కనుక ఆదివారం మాంసాహారం తినకూడదని చెబుతున్నారు.
అయితే ఈ ఆచారాలు, నమ్మకాలు ఎలా ఉన్నా.. ఆదివారం మాంసాహారం తినే విషయంలో మాత్రం ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిదే అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఒకరిని ఫలానా రోజు అది తినకూడదని ఎవరూ చెప్పలేరు. ఆహారపు అలవాట్లు ఎవరిష్టం వారివి. కనుక నమ్మకం ఉన్నవారు ఆచారాలను, వ్యవహారాలను పాటించవచ్చు. లేదంటే యథావిధిగా ఎప్పుడు ఏ రోజు ఏది కావాలంటే అది తినవచ్చు. అందులో అభ్యంతరం ఏమీ లేదు. ఆహారం ఎప్పుడు ఏది తినాలన్నది ఎవరిష్టం వారిది. కనుక దీనిపై ఒకరిపై బలవంతంగా ఒత్తిడి చేయరాదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…