Tamarind Seeds : చింత గింజలను సహజంగానే చాలా మంది పడేస్తుంటారు. చింతపండును ఉపయోగించాక అందులో ఉన్న గింజలను పడేస్తుంటారు. అయితే వాస్తవానికి చింత గింజలతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. చింతగింజలను ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. వీటితో అనేక రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చు. చింతగింజలతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చింతగింజల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. కనుక ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. దీంతో షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ గింజల్లో ఉండే ఫినోలిక్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్ మన శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీంతో రోగాలు రాకుండా చూసుకోవచ్చు. అలాగే ఈ గింజల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు సైతం అధికంగానే ఉంటాయి. అందువల్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో ఆయా నొప్పులను తగ్గించుకోవచ్చు.
ఈ గింజలు చర్మాన్ని సైతం సంరక్షిస్తాయి. వీటిల్లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. అందువల్ల వీటి పొడిని వాడితే చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. మృదువుగా ఉంటుంది. దీంతో యవ్వనంగా ఉంటారు. చర్మం తన సాగే గుణాన్ని కోల్పోదు, దీంతో వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు. ముఖంపై ముడతలు కనిపించవు. ఈ గింజలు జీర్ణ సమస్యలకు సైతం చక్కగా పనిచేస్తాయి. వీటితో జీర్ణశక్తి పెరుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అలాగే మలబద్దకం ఉండదు. గ్యాస్ తగ్గుతుంది.
ఈ గింజలను వాడడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయని సైంటిస్టులు తమ పరిశోధనల్లో తేల్చారు. అందువల్ల వీటిని తీసుకుంటే షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఫలితంగా కిడ్నీలు, కళ్లు, లివర్ అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. ఎలాంటి సమస్యలు రావు. ఇలా చింత గింజలతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు వీటిని వాడుకోవాలి. దీంతో అనుకున్న ఫలితాలు వస్తాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…