ఆరోగ్యం

Foods For Brain Health : వీటిని తింటే చాలు.. మీ మెద‌డు కంప్యూట‌ర్ క‌న్నా వేగంగా ప‌నిచేస్తుంది..!

Foods For Brain Health : మ‌న‌లో చాలా మంది పిల్ల‌ల‌కు జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గగాల‌ని ర‌క‌ర‌కాల ప్ర‌యత్నాలు చేస్తూ ఉంటారు. లేహ్యాల‌ను, పొడుల‌ను వారికి ఇస్తూ ఉంటారు. అయితే వీటిని వాడ‌డం వ‌ల్ల ఫ‌లితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. అలాగే ఇవి ఖ‌ర్చుతో కూడుకున్న‌వి. అయితే మ‌నం తీసుకునే ఆహారం ద్వారా మ‌న శ‌రీర ఆరోగ్యం ఎలా మెరుగుప‌డుతుందో అదే విధంగా మ‌నం తీసుకునే ఆహారం ద్వారా మ‌న మెద‌డు కూడా చ‌క్క‌గా ప‌ని చేస్తుంద‌ని, జ్ఞాప‌క శ‌క్తి కూడా పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న మెద‌డు న‌రాల స‌ముదాయం. మెద‌డులోని న‌రాలు ఆరోగ్యంగా ఉండాల‌న్నా, జ్ఞాప‌క శ‌క్తి పెర‌గాల‌న్నా మ‌న మెద‌డుకు మూడు ముఖ్య‌మైన పోష‌కాలు చాలా అవ‌స‌రం. జింక్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విట‌మిన్ ఇ… ఈ మూడు పోష‌కాలు మ‌న మెద‌డుకు చ‌క్క‌గా అందితేనే మ‌న మెద‌డు చ‌క్క‌గా ప‌ని చేస్తుంది.

శ‌రీరంలో జింక్ లోపించ‌డం వ‌ల్ల మెద‌డు ప‌ని తీరు త‌గ్గుతుంది. మెద‌డు కణాల పనితీరు దెబ్బతింటుంది. గ‌ర్భిణీ స్త్రీలు జింక్ ను త‌క్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల పుట్టే పిల్ల‌ల్లో జ్ఞాప‌క‌శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు న‌రాలు చ‌క్క‌గా ప‌ని చేస్తాయి. ఈ ఫ్యాటీ యాసిడ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎక్కువ కాలం పాటు అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే మ‌నం ఆలోచించిన‌ప్పుడు మెద‌డులో అనేక ర‌కాల ర‌సాయ‌నాలు విడుద‌ల అవుతాయి. ఇవి మెద‌డు క‌ణాల జీవిత‌కాలాన్ని త‌గ్గిస్తాయి. మెద‌డు కణాలు త్వ‌ర‌గా న‌శించేలా చేస్తాయి. విట‌మిన్ ఇ ఈ ర‌సాయ‌నాల కార‌ణంగా మెద‌డు కణాలు దెబ్బ‌తిన్న‌కుండా యాంటీ ఆక్సిడెంట్ గా ప‌ని చేయ‌డంతో పాటు జ్ఞాప‌క‌శ‌క్తిని కూడా ప‌ని చేస్తుంది. క‌నుక ఈ మూడు పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని పిల్ల‌ల‌కు ఆహారంగా ఇవ్వ‌డం వ‌ల్ల వారికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌న‌కు 7 నుండి 10 మిల్లీ గ్రాముల జింక్ అవ‌స‌ర‌మ‌వుతుంది.

Foods For Brain Health

పొద్దు తిరుగుడు ప‌ప్పు, తెల్ల నువ్వులు, న‌ల్ల నువ్వులు, జ‌న‌ప‌నార విత్త‌నాల్లో జింక్ ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే జింక్ ల‌భిస్తుంది. అలాగే మ‌న శ‌రీరానికి 1 నుండి 1.6 మిల్లీ గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఒక‌రోజుకు అవ‌స‌ర‌మ‌వుతాయి. వాల్ న‌ట్స్ లో, చేప‌ల‌ల్లో, అవిసె గింజ‌లు,చియా విత్త‌నాలు వంటి ఆహారాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌గా ఉంటాయి. అదే విధంగా ఒక రోజుకు మ‌న శ‌రీరానికి 15 మిల్లీ గ్రాముల విట‌మిన్ ఇ అవ‌స‌ర‌మ‌వుతుంది. హ‌జ‌ల్ న‌ట్స్, బాదం ప‌ప్పు, పొద్దు తిరుగుడు ప‌ప్పు వంటి వాటిలో విట‌మిన్ ఇ ఎక్కువ‌గా ఉంటుంది. ఈ ఆహారాల‌ను పిల్ల‌ల‌కు త‌రుచుగా ఇవ్వాలి. అలాగే వారితో ప్రాణాయామం చేయించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వారిలో జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది. మెద‌డు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ధురంధర్ 2’ ఇండస్ట్రీ కళ్లు తెరిపించింది.. అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ రికార్డుల‌ను షేక్ చేస్తూ ఘ‌న విజ‌యం సాధించి ముందుకు సాగుతున్న…

Wednesday, 25 March 2026, 12:27 PM

నత్తి సమస్య, బాడీ షేమింగ్‌.. చిన్ననాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సమీరా రెడ్డి!

బాల్యంలో ప‌డే ముద్ర‌లు ఎంతో లోతుగా ఉంటాయ‌ని, పెద‌య్యాక కూడా అవి బాధిస్తుంటాయ‌ని, వాటిని అంత సుల‌భంగా మ‌రిచిపోలేమ‌ని న‌టి…

Tuesday, 24 March 2026, 12:55 PM

ఐపీఎల్ ధాటికి పీఎస్‌ఎల్ విలవిల.. విదేశీ ప్లేయర్లు జంప్! పీసీబీ సీరియస్ వార్నింగ్..

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…

Monday, 23 March 2026, 10:14 PM

4 రోజుల్లో రూ.411 కోట్లు.. ‘ధురంధర్ 2’ రికార్డుల వేట! విమర్శకులకు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్..

రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…

Monday, 23 March 2026, 12:16 PM

ముంబై ఇండియన్స్ ప్రీ-సీజన్ ఈవెంట్‌లో రోహిత్ డ్యాన్స్.. హార్దిక్ జోడీ సందడి! వీడియో వైరల్..

ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…

Sunday, 22 March 2026, 8:38 PM

ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’.. ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీ విష్ణు, నయనా సరిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విష్ణు విన్యాసం చిత్రం ప్ర‌స్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వ‌చ్చింది.…

Sunday, 22 March 2026, 7:48 PM

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM