Realme GT Neo2 : మొబైల్స్ తయారీదారు రియల్‌మి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో ఆకట్టుకునే స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్‌లో విడుదల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఇంకో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో ఫీచర్లు అదిరిపోయాయి. వాటిపై ఓ లుక్కేద్దామా..!
రియల్‌మి కొత్తగా జీటీ నియో2 పేరిట జీటీ సిరీస్‌లో ఓ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో 6.62 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అమర్చారు. అందువల్ల 5జి కి సపోర్ట్ లభిస్తుంది.
ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో విడుదలైంది. అదనంగా మరో 7 జీబీ వర్చువల్ ర్యామ్ లభిస్తుంది. ఇక హీట్‌కు తట్టుకునే విధంగా ప్రత్యేక కూలింగ్ టెక్నాలజీని ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా.. మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఇంకో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. ఇక ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరా లభిస్తుంది.
ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. డ్యుయల్ సిమ్ వేసుకోవచ్చు. మెమొరీ కార్డు స్లాట్ లేదు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.. వంటి ఇతర ఫీచర్లు ఈ ఫోన్‌లో లభిస్తున్నాయి.
ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.31,999 ఉండగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.35,999 గా ఉంది. ఈ ఫోన్ ను రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, అన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్ లో అక్టోబర్ 17వ తేదీ నుంచి విక్రయించనున్నారు. పండుగల సందర్భంగా ఈ ఫోన్లు రూ.24,999, రూ.28,999 ధరలకే లభిస్తున్నాయి. తరువాత మళ్లీ యథావిధి ధరలకు విక్రయిస్తారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…