Realme GT Neo2 : అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో మార్కెట్‌లోకి వ‌చ్చిన రియ‌ల్‌మి కొత్త ఫోన్..!

October 14, 2021 12:16 PM

Realme GT Neo2 : మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో ఆక‌ట్టుకునే స్మార్ట్ ఫోన్‌ల‌ను మార్కెట్‌లో విడుద‌ల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా అద్భుత‌మైన ఫీచ‌ర్లు క‌లిగిన ఇంకో స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఇందులో ఫీచ‌ర్లు అదిరిపోయాయి. వాటిపై ఓ లుక్కేద్దామా..!

Realme GT Neo2 smart phone launched in india

రియ‌ల్‌మి కొత్త‌గా జీటీ నియో2 పేరిట జీటీ సిరీస్‌లో ఓ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో 6.62 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూషన్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగ‌న్ 870 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. అందువ‌ల్ల 5జి కి స‌పోర్ట్ ల‌భిస్తుంది.

ఈ ఫోన్ 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. అద‌నంగా మ‌రో 7 జీబీ వ‌ర్చువ‌ల్ ర్యామ్ ల‌భిస్తుంది. ఇక హీట్‌కు త‌ట్టుకునే విధంగా ప్ర‌త్యేక కూలింగ్ టెక్నాల‌జీని ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉండ‌గా.. మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఇంకో 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. ఇక ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరా ల‌భిస్తుంది.

ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది. డ్యుయ‌ల్ సిమ్ వేసుకోవ‌చ్చు. మెమొరీ కార్డు స్లాట్ లేదు. ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.. వంటి ఇత‌ర ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ల‌భిస్తున్నాయి.

ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.31,999 ఉండ‌గా, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.35,999 గా ఉంది. ఈ ఫోన్ ను రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌, అన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్ లో అక్టోబ‌ర్ 17వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు. పండుగ‌ల సంద‌ర్భంగా ఈ ఫోన్లు రూ.24,999, రూ.28,999 ధ‌రల‌కే ల‌భిస్తున్నాయి. త‌రువాత మ‌ళ్లీ య‌థావిధి ధ‌ర‌ల‌కు విక్రయిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment